African Swine Fever : కేరళలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్.. 19 పందులు మృతి

కేరళలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ కలకలం రేపుతోంది. ఈ ఫీవర్‌ కారణంగా ఇప్పటివరకు 19 పందులు మృతి చెందాయి. మరో 48 పందులను పశుసంవర్ధక శాఖ అధికారులు బలవంతంగా చంపేశారు. ఈ వ్యాధి కారణంగా కేరళలోని పలు ప్రాంతాల్లో పంది మాంసం విక్రయాలను ప్రభుత్వం నిలిపివేసింది.

African Swine Fever : కేరళలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్.. 19 పందులు మృతి

African swine fever

Updated On : October 31, 2022 / 7:58 AM IST

African Swine Fever : కేరళలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ కలకలం రేపుతోంది. ఈ ఫీవర్‌ కారణంగా ఇప్పటివరకు 19 పందులు మృతి చెందాయి. మరో 48 పందులను పశుసంవర్ధక శాఖ అధికారులు బలవంతంగా చంపేశారు. ఈ వ్యాధి కారణంగా కేరళలోని పలు ప్రాంతాల్లో పంది మాంసం విక్రయాలను ప్రభుత్వం నిలిపివేసింది. కొట్టాయం జిల్లాలోని ఓ ప్రైవేట్‌ పందుల ఫారంలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ కేసులు నమోదవడంతో అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

ఈ వ్యాధి సోకిన ప్రాంతాలకు ఆరోగ్యవంతమైన పందులు వెళ్లకుండా పశుసంవర్ధకశాఖ సిబ్బంది కాపు కాస్తున్నారు. అయితే, ఈ ఆఫ్రికన్‌ స్వైన్‌ వైరస్‌ మనుషులకు సోకదని వైద్యనిపుణులు చెప్తున్నారు. ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ తొలి కేసు అక్టోబర్ 13వ తేదీన నమోదైనట్లు సమాచారం. ఆ తర్వాత 2-3 రోజులకు 6, 7 పందులు చనిపోయినట్లు అధికారులు గుర్తించారు.

African Swine Fever: అసోంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ గుర్తింపు

పందుల మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు వాటి శాంపిల్స్‌ను ల్యాబ్స్‌కు పంపగా.. వాటిలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు. ఈ వైరస్‌ ప్రధానంగా పెంపుడు పందులపై ప్రభావం చూపుతుందని, ఈ వ్యాధితో మరణాల రేటు 100 శాతం ఉంటుందని ఎపిడెమియాలజిస్ట్ రాహుల్ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ జ్వరంతో బాధపడుతున్న జంతువుల నుంచి స్పర్ష ద్వారా గానీ, శరీర ద్రవాల ద్వారా గానీ మరో జంతువుకు వ్యాపిస్తుందని ఆయన తెలిపారు.

ఈ వైరస్‌కు గురైన పందులను బలవంతంగా చంపేసి పూడ్చిపెట్టడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టే వీలుంది. ఈ వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పంది మాంసం విక్రయాలతోపాటు పందుల తరలింపు, పందుల అమ్మకాలను ప్రభుత్వం నిషేధించింది. ఇలాఉండగా, గత కొన్ని నెలల క్రితం వయనాడ్‌, కన్నూర్‌ జిల్లాల్లో కూడా ఈ వ్యాధి బయటపడినట్లు తెలుస్తోంది.

Uttar Pradesh: పందులకు స్వైన్ ఫీవర్.. మాంసం మార్కెట్లు నిషేదించిన బరేలీ

అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అసోసియేషన్ ప్రకారం, పందులకు పచ్చి ఆహారాన్ని తినిపించడం వల్ల కూడా వైరస్ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి చెందుతుంది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌కు గురైన పందుల్లో అధిక జ్వరం, ఆకలి లేకపోవడం, బలహీనత, చర్మం ఎర్రబడటం, పొక్కులు, అతిసారం, వాంతులు, దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.