Sisters Married Same Man: అక్కను చేసుకుంటే చెల్లెలు ఫ్రీ అనుకున్నాడు.. కానీ!!

ఒకే సారి.. ఒకే మండపంలో ఒకే ఇంట్లోని ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిని వివాహం చేసుకున్నందుకు కాదు..

Sisters Married Same Man: అక్కను చేసుకుంటే చెల్లెలు ఫ్రీ అనుకున్నాడు.. కానీ!!

Sisters Married Man

Updated On : May 18, 2021 / 6:26 AM IST

Sisters Married Same Man: ఒకే సారి.. ఒకే మండపంలో ఒకే ఇంట్లోని ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిని వివాహం చేసుకున్నందుకు కాదు.. వారిలో ఒకరు మైనర్ అని.. మే7న జరిగిన ఈ వివాహానికి సంబంధించిన వీడియో వైరల్ అవడంతో అధికారుల దృష్టికి వెళ్లింది.

కర్ణాటకలోని కోలారు జిల్లా వేగమడుగు గ్రామానికి చెందిన రాణెమ్మ, నాగరాజప్పల కూతుళ్లు సుప్రియ, లలితలు. మూగ–బధిర అయిన చెల్లెలు లలితకి వివాహం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారని భావించారు.

ఈ క్రమంలోనే సుప్రియకు బాగేపల్లికి చెందిన ఉమాపతి అనే యువకునితో పెళ్లి నిశ్చయమైంది. వారి సమస్యను చర్చించుకుని ఇద్దరి సోదరీమణులను ఒకరికే ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు.

మే 7వ తేదీన పెళ్లి మండపంలో పెద్దల అనుమతితో ఉమాపతి ఇద్దరినీ వివాహమాడాడు. ఘటన ఆలస్యంగా వెలుగు చూడటంతో రెండో వధువు లలితకు 18 ఏళ్లు దాటలేదని తెలిసింది. శిశు సంక్షేమ, పోలీసు అధికారులు వచ్చి వరుడు సహా ఏడుగురిపై కేసు నమోదు చేసి వరుడిని అరెస్ట్ చేశారు.