Srinagar Encounter : భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. రంగ్రెత్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు

Srinagar Encounter : భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

Kashmir

Updated On : December 13, 2021 / 3:43 PM IST

Srinagar Encounter : జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. రంగ్రెత్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాయి.

ఈ క్రమంలో బలగాలను చూసిన ఓ ఉగ్రవాది సైనికులపైకి కాల్పులు ప్రారంభించాడు. ఆ తర్వాత బలగాలు ఉగ్రవాదికి లొంగిపోయేందుకు అవకాశం ఇచ్చారు. అయినా వినకుండా కాల్పులకు తెగబడడంతో ప్రతిగా బలగాలు కాల్పులు జరిపాయి. బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

మృతులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో ఇంకా తెలియలేదని అధికారులు తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో భద్రతను మరింత పటిష్ఠం చేశారు.
ALSO READ Kashi Vishwanath Corridor : కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించిన ప్రధాని