అస్సాం బాంబు పేలుళ్ల కేసులో 10 మందికి జీవితఖైదు

  • Published By: venkaiahnaidu ,Published On : January 30, 2019 / 08:30 AM IST
అస్సాం బాంబు పేలుళ్ల కేసులో 10 మందికి జీవితఖైదు

Updated On : January 30, 2019 / 8:30 AM IST

2008 అస్సాం వరుస బాంబు పేలుళ్లకు సంబంధించి రెండు రోజుల క్రితం  14 మందిని దోషులుగా తేల్చిన  సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం(జనవరి 30,2019) వారికి శిక్షలు ఖరారు చేసింది. ఈ కేసుకి సంబంధించి నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్(NDFB) వ్యవస్థాపకుడు రంజన్ దైమరీతో పాటుగా మరో 9మందికి జీవిత ఖైదు విధించింది. మిగిలిన నలుగురు ఈ కేసులో శిక్షను అనుభవించి ఫైన్ చెల్లించారు.

అక్టోబర్ 30, 2008లో అస్సామ్ లోని నాలుగు జిల్లాల్లో 11 వరుస బాంబు పేళుల్లు జరిగాయి. ఈ ఘటనలో 87మంది ప్రాణాలు కోల్పోయారు. అదే ఏడాది ఈ కేసు విచారణను సీబీఐ ప్రారంభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డైమరీ బంగ్లాదేశ్ లో అరెస్ట్ అయ్యాడు. 2012లో అతడిని భారత పోలీసులకు అప్పగించారు. 2013లో బెయిల్ పై విడుదల అయ్యాడు. ప్రస్తుతం ప్రభుత్వంతో శాంతి చర్చల్లో పాల్గొంటున్నాడు. ఈ కేసులో జీవిత ఖైదు శిక్ష పడిన మిగిలిన తొమ్మిది మంది జార్జి బొడొ, బి థరాయ్, రాజు సర్కార్, అన్చాయ్ బొడొ, ఇంద్రా బ్రహ్మ, లొకొ బాసుమతరి, ఖర్గేశ్వర్ బాసుమతరి, ప్రభాత్ బొడొ, జయంత్ బొడొ, అజయ్ బాసుమతరి, మథురమ్ బ్రహ్మ, రాజన్ గొగొయ్ లు ఎన్డీఎఫ్ బీతో సంబంధం కలిగి ఉన్నవారే.