Indians Returned : ఇజ్రాయెల్ నుంచి భారతీయులు సురక్షితంగా స్వదేశానికి.. తొలి విమానంలో 212 భారతీయులు

'ఆపరేషన్ అజయ్'పై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు.

Indians Returned : ఇజ్రాయెల్ నుంచి భారతీయులు సురక్షితంగా స్వదేశానికి.. తొలి విమానంలో 212 భారతీయులు

Indians returned from Israel

Updated On : October 13, 2023 / 9:46 AM IST

Indians Returned From Israel : ఇజ్రాయెల్ నుంచి భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. ఇజ్రాయెల్ నుంచి భారతీయులను భారత ప్రభుత్వం సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చింది. ‘ఆపరేషన్ అజయ్’ పేరుతో భారత ప్రభుత్వం తరలింపు చర్యలు చేపట్టింది. తొలి విమానంలో 212 భారతీయులు స్వదేశం చేరుకున్నారు. ఇజ్రాయెల్ – హమాస్ (పాలస్తీనా) మధ్య యుద్ధంతో అంశాంతి వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్‌లో సుమారు 18వేల మంది భారతీయులు నివసిస్తున్నారు.

‘ఆపరేషన్ అజయ్’పై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయుల్లో విద్యార్థులే అధికంగా ఉన్నారు. వైద్యం, వ్యవసాయం, టెక్నాలజీ తదితర రంగాల్లో విద్యాభ్యాసం, పరిశోధనల కోసం భారతీయులు ఇజ్రాయెల్‌ వెళ్లారు. ఇజ్రాయెల్‌ నుంచి తొలి విమానంలో వచ్చిన భారతీయులు టెల్ అవీవ్, హైఫా నగరాల్లో నివసిస్తున్నారు.

Israeli–Palestinian Conflict: ఇజ్రాయెల్ మీద హమాస్ దాడిలో భారతీయులు ఎవరైనా చనిపోయారా? విదేశాంగ శాఖ ఏం చెప్పిందంటే?

హమాస్ విరుచుకుపడ్డ సమయంలో సైరన్లు వినిపించాయని భారతీయులు చెబుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలన్న అంశాలపై ముందే వారికి శిక్షణ ఇచ్చారు. బాంబు షెల్టర్లకు పరుగులు తీసి భారతీయులు ప్రాణాలు కాపాడుకున్నారు. హమాస్ ఉగ్రవాదుల ఊచకోతతో భారతీయులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.