Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర ముగింపు సభకు 24 పార్టీలకు ఆహ్వానం

2014 సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం అనంతరం.. కాంగ్రెస్ పరిస్థితి రాను రాను మరింత దారుణంగా పరిస్థితికి చేరింది. ఇలాంటి తరుణంలో రాహుల్ యాత్ర పట్ల కాంగ్రెస్ వర్గాల్లోనే అనుమానాలు ఉండేవట. అయితే యాత్ర ప్రారంభై కొనసాగుతున్న క్రమంలో ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో, పార్టీకి పూర్వ వైభవం వచ్చిందన్న ఆనందంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. దీంతో ఈ యాత్ర ముగింపు సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర ముగింపు సభకు 24 పార్టీలకు ఆహ్వానం

24 Parties Invited To Join The Close Of Rahul Gandhi's Yatra

Updated On : January 11, 2023 / 7:31 PM IST

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర ముగింపు సభకు కాంగ్రెస్ పార్టీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ యాత్ర ఈ నెల 30న ముగియనుంది. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమై కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ మీదుగా ప్రస్తుతం పంజాబ్ చేరుకుని, అక్కడే కొనసాగుతోంది. కొద్ది రోజుల్లో పంజాబ్ దాటి హిమాచల్ ప్రదేశ్ చేరుకుంటుంది. అక్కడ ముగించుకుని జమ్మూ కశ్మీర్ చేరుకుంటుంది. ఈ రాష్ట్రంలో పర్యటన అనంతరం ముగుస్తుంది.

Lakhimpur Kheri Violence: వేరే కేసులు తీసుకోకుండా, వాయిదా వేయకుండా కేవలం లఖింపూర్ కేసు విచారణకే ఐదేళ్లు పడుతుందట!

యాత్ర ప్రారంభానికి ముందు బహుశా కాంగ్రెస్ పార్టీలో సైతం కొన్ని ఆందోళనలు ఉన్నాయట. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం అనంతరం.. కాంగ్రెస్ పరిస్థితి రాను రాను మరింత దారుణంగా పరిస్థితికి చేరింది. ఇలాంటి తరుణంలో రాహుల్ యాత్ర పట్ల కాంగ్రెస్ వర్గాల్లోనే అనుమానాలు ఉండేవట. అయితే యాత్ర ప్రారంభై కొనసాగుతున్న క్రమంలో ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో, పార్టీకి పూర్వ వైభవం వచ్చిందన్న ఆనందంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. దీంతో ఈ యాత్ర ముగింపు సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

Lakshadweep MP: మర్డర్ అటెంప్ట్ కేసులో లక్షద్వీప్ ఏకైక ఎంపీకి 10 ఏళ్ల జైలు శిక్ష

ఇందు కోసం దేశంలో భావసారూప్యత కలిగిన 24 పార్టీల అధినేతలకు కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. మాయావతి (బహుజన్ సమాజ్ పార్టీ), మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్ పార్టీ), నితీశ్ కుమార్ (జనతాదళ్ యూనియన్), చంద్రబాబు నాయుడు (తెలుగుదేశం పార్టీ), లాలూ ప్రసాద్ యాదవ్ (రాష్ట్రీయ్ జనతా దళ్), అఖిలేష్ యాదవ్ (సమాజ్‭వాదీ పార్టీ), కమ్యూనిస్ట్ పార్టీలు సహా మరికొన్ని పార్టీలకు స్వాగతం పలికారు. ఇందులో ఎంత మంది హాజరవుతారనేది జనవరి 30న జరిగే ముగింపు కార్యక్రమం రోజున తెలుస్తుంది.