Lightning People Kill : దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగుపాటుకు 24 మంది దుర్మరణం

దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. వివిధ రాష్ట్రాల్లో పిడుగుపాటుకు 24 మంది మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు.

Lightning People Kill : దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగుపాటుకు 24 మంది దుర్మరణం

Lightning Strikes

Updated On : August 8, 2021 / 9:12 AM IST

lightning 24 people kill : దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. వివిధ రాష్ట్రాల్లో పిడుగుపాటుకు 24 మంది మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు. జార్ఖండ్‌లోని పలాము జిల్లాలో పిడుగుపడి ఎనిమిది మంది చనిపోయారు. మృతుల్లో ఇద్దరు బాలికలు, రైతు ఉన్నారు.

బీహార్‌లోని బంకా ప్రాంతంలో కూడా పిడుగులు పడ్డాయి. దీంతో పిడుగుపడి ఏడుగురు దుర్మరణం చెందారు. ఒడిశాలోని మయూర్‌భంజ్‌, భద్రక్‌, బాలాసోర్‌ జిల్లాల్లో పిడుగుపాటుకు ఐదుగురు మరణించారు.

పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌, ఈస్‌ బర్ద్‌వాన్‌ జిల్లాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. పిడుగులు పడి మహిళ సహా నలుగురు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.