జమిలి ఎన్నికల పార్లమెంటరీ స్థాయీ సంఘం ఛైర్‌పర్సన్‌గా ఎంపీ పీపీ చౌదరి.. మొత్తం 39 మంది సభ్యులు
ఈ స్థాయీ సంఘంలో లోక్‌సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులు ఉంటారని లోక్‌సభ సెక్రటేరియట్ తెలిపింది.

One Nation One Election: ‘వన్ నేషన్, వన్ నేషన్’ బిల్‌ను పరిశీలించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చైర్‌పర్సన్‌గా బీజేపీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు పీపీ చౌదరి నియమితుడైనట్లు లోక్‌సభ సెక్రటేరియట్ గురువారం ప్రకటించింది.
ఈ స్థాయీ సంఘం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం, ఎన్నికల ప్రక్రియలను క్రమబద్ధీకరించడం వంటి అంశాలను పరిశీలిస్తుంది. ఎన్నికల వ్యయాన్ని తగ్గించడం వంటి అంశాలను కూడా పరిశీలిస్తుంది ఈ కమిటీ. ఈ స్థాయీ సంఘంలో లోక్‌సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులు ఉంటారని లోక్‌సభ సెక్రటేరియట్ తెలిపింది.
వారి పేర్లను కూడా ప్రకటించింది. తదుపరి పార్లమెంటు సమావేశాల చివరి వారం మొదటి రోజున నివేదికను ఈ స్థాయీ సంఘం లోక్‌సభకు సమర్పిస్తుంది. శుక్రవారం రాజ్యసభ వాయిదా పడకముందు.. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’పై రెండు బిల్లుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయడంపై న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చేసిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.
స్థాయీ సంఘంలోని సభ్యులు వీరే..
KTR : ఫార్ములా ఈ కార్ రేస్ ఎసిపోడ్ లో కీలక పరిణామం.. కేటీఆర్ పై మరో కేసు..