Madhya Pradesh : ట్రక్కును ఢీకొన్న బస్సు…39 మంది బీజేపీ కార్యకర్తలకు గాయాలు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖర్గోనీ జిల్లాలో పార్కింగ్ చేసి ఉన్న ట్రక్కును బస్సు ఢీకొన్న ఘటనలో 39 మంది బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు....

Madhya Pradesh : ట్రక్కును ఢీకొన్న బస్సు…39 మంది బీజేపీ కార్యకర్తలకు గాయాలు

Bus Crashes

Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖర్గోనీ జిల్లాలో పార్కింగ్ చేసి ఉన్న ట్రక్కును బస్సు ఢీకొన్న ఘటనలో 39 మంది బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలతో వెళుతున్న బస్సు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో 39 మంది ప్రయాణికులు గాయపడ్డారు. (Bus Crashes into parked truck in Madhya Pradesh) బీజేపీ కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొనే సమావేశం మహాకుంభ్ కు హాజరయ్యేందుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత ఎయిర్ రైఫిల్ టీమ్ వరల్డ్ రికార్డ్ …మొదటి స్వర్ణ పతకం

కస్రవాడ సమీపంలో ఆదివారం అర్థరాత్రి ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఎక్కువగా ఖపర్జమ్లీ, రూప్‌గఢ్, భగవాన్‌పురా, రాయ్ సాగర్‌కు చెందిన బీజేపీ కార్యకర్తలు ప్రయాణిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాగిన బీజేపీ జన్ ఆశీర్వాద యాత్రల అధికారిక ముగింపు సందర్భంగా జనసంఘ్ సహ వ్యవస్థాపకుడు దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా కార్యకర్త మహాకుంభ్ నిర్వహిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

Ganesha Puja : సీఎం ఇంట్లో వినాయకుడికి పూజలు చేసిన సల్మాన్, షారుఖ్ ఖాన్

కాంగ్రెస్‌తో గట్టి పోటీని ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్‌లో గత 45 రోజుల్లో ప్రధాని మోదీ పర్యటించడం ఇది మూడోసారి. మహాకుంభ్’ కార్యక్రమానికి 10 లక్షల మందిని సమీకరించాలని బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా లక్ష్యంగా పెట్టుకుంది.