4రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను ఆదివారం విడుదల చేసింది. దేశంలోని 543 లోక్ సభ స్దానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 175, ఒడిశా 147, సిక్కిం 32, అరుణాచల్ ప్రదేశ్ లోని 60 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఏపీ అసెంబ్లీకి ఏప్రిల్ 11 న ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 23న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తారు.
ఒడిషా అసెంబ్లీకి నాలుగు విడతల్లో పోలింగ్ జరుగుతుంది. మొదటి విడత పోలింగ్ ఏప్రిల్ 11 న జరుగుతుంది. మే 23న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తారు.
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ లకు ఒకే విడతలో ఏప్రిల్ 11 న పోలింగ్ జరుగుతుంది. మే 23న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తారు.