Uttarakhand : 13 రోజులుగా ఉత్తరాఖండ్ టన్నెల్ లోనే 41 మంది కార్మికులు.. డ్రిల్లింగ్ మిషన్ లో సాంకేతిక లోపంతో నిలిచిన రెస్క్యూ ఆపరేషన్

కార్మికులను బయటికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీమ్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మెక్రో టన్నెల్ ఏర్పాటుకు రెస్క్యూ టీమ్స్ 46.8 మీటర్ల మేర పైపులను లోనికి పంపారు.

Uttarakhand : 13 రోజులుగా ఉత్తరాఖండ్ టన్నెల్ లోనే 41 మంది కార్మికులు.. డ్రిల్లింగ్ మిషన్ లో సాంకేతిక లోపంతో నిలిచిన రెస్క్యూ ఆపరేషన్

Uttarakhand Tunnel Incident

Updated On : November 24, 2023 / 10:28 AM IST

Uttarakhand Tunnel Incident : ఉత్తరాఖండ్ సిల్క్యారా టన్నెల్ కుప్పకూలిన విషయం తెలిసిందే. 13 రోజులుగా టన్నెల్ లో 41 మంది కార్మికులు ఉన్నారు. టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఆగర్ డ్రిల్లింగ్ మిషన్ లో సాంకేతిక లోపంతో నిన్న రెస్క్యూ ఆపరేషన్ నిలిచిపోయింది. ఆగర్ డ్రిల్లింగ్ మిషన్ కి మరమ్మత్తులు పూర్తైన తరువాత రెస్క్యూ ఆపరేషన్ తిరిగి ప్రారంభం కానుంది. ఉదయం 11:30 గంటల తరువాత ఆగార్ మిషన్ తో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

అన్ని సక్రమంగా జరిగితే ఈ సాయంత్రానికి రెస్క్యూ పూర్తయ్యే అవకాశముంది. ఈరోజు రాత్రికి కార్మికులు సురక్షితంగా బయటకు వస్తారని రెస్క్యూ టీమ్స్ భావిస్తోంది. కార్మికులను బయటికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీమ్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. టన్నెల్ లోని కార్మికులను రక్షించేందుకు సహాయ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మెక్రో టన్నెల్ ఏర్పాటుకు రెస్క్యూ టీమ్స్ 46.8 మీటర్ల మేర పైపులను లోనికి పంపారు. మొత్తం 60 మీటర్ల మేర పైపులు టన్నెల్ లోపలికి వెళితే పైపుల గుండా కార్మికులు బయటకు రానున్నారు.

Air pollution : ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం.. కళ్లలో మంట, శ్వాస కోస సమస్యలతో బాధపడుతున్న ప్రజలు

నిపుణులు రెస్క్యూ ఆపరేషన్ లో డ్రోన్ సాంకేతికను వినియోగిస్తున్నారు. అమెరికా నుంచి వచ్చిన ఆగర్ డ్రిల్లింగ్ యంత్రం గంటకు సుమారు 3 మీటర్ల మేర శిధిలాలను తొలగిస్తోంది. టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులకు సహాయక సిబ్బంది వాటర్ బాటిల్స్ లో ఆహారం (కిచిడి) నింపి పంపింది. కార్మికుల కోసం టన్నెల్ వద్ద కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.

మరోవైపు ఈ ఘటనతో ఉత్తరాఖండ్‌లో ఈరోజు అత్యంత వైభవంగా జరుపుకునే ఎగస్ పండుగను జరుపుకోకూడదని నిర్ణయించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి టన్నెల్ కంట్రోల్ రూమ్ వద్ద ఉండి సహాయక కార్యక్రమలు పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు తన నివాసంలో జరిగే ఎగస్ ఉత్సవానికి పుష్కర్ సింగ్ ధామి దూరంగా ఉన్నారు.