Air pollution : ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం.. కళ్లలో మంట, శ్వాస కోస సమస్యలతో బాధపడుతున్న ప్రజలు

యూపీ, హర్యానా, రాజస్థాన్ నుంచి వచ్చే వాహనాలు, పంట వ్యర్ధాల దహనంతో కాలుష్య తీవ్రత పెరుగుతోంది.

Air pollution : ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం.. కళ్లలో మంట, శ్వాస కోస సమస్యలతో బాధపడుతున్న ప్రజలు

Delhi Air pollution (1)

Delhi Air pollution : గత కొంతకాలంగా దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు వాయు కాలుష్యంతో సతమతమవుతున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో కొసాగుతోంది. వాయు వేగం తగ్గడంతో వాయు కాలుష్యం పూర్ కేటగిరి నుంచి సివియర్ కేటగిరికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై ఢిల్లీలో సగటున 388 పాయింట్లుగా గాలి నాణ్యత నమోదు అయింది. ఆర్కే పురంలో 422, వాజి పూర్ లో 443, అలీ పూర్ లో 432, ఆనంద్ విహార్ లో 411 పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత నమోదు అయింది.

లోధి రోడ్ లో 359, గురు గ్రామ్ లో 321, నోయిడాలో 363 పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత నమోదు అయింది. యూపీ, హర్యానా, రాజస్థాన్ నుంచి వచ్చే వాహనాలు, పంట వ్యర్ధాల దహనంతో కాలుష్య తీవ్రత పెరుగుతోంది. వాయు కాలుష్యంతో కళ్లలో మంట, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస కోస సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Indian student Kill : అమెరికాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య

కాలుష్య నివారణ కోసం ఢిల్లీ ప్రభుత్వం 15 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. రెడ్ లైట్ ఆన్ వెహికల్ ఆఫ్, రోడ్లపై నీటిని చల్లడం, బయోమాస్ కాల్చకుండా చూడటంతోపాటు కాలుష్య నియంత్రణ గ్రాప్ 3 చర్యలను ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తోంది.