మృత్యుంజయుడు : బోరు బావి నుండి తల్లి ఒడికి

  • Published By: madhu ,Published On : April 14, 2019 / 01:26 AM IST
మృత్యుంజయుడు : బోరు బావి నుండి తల్లి ఒడికి

Updated On : April 14, 2019 / 1:26 AM IST

బోరు బావిలో పడిపోయిన బాలుడిని NDRF బలగాలు క్షేమంగా బయటకు తీసుకొచ్చాయి. బోరు బావి నుండి తల్లి ఒడికి చేరాడు. తమ బిడ్డ క్షేమంగా బయటకు రావడంతో  తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. NDRF సిబ్బందికి వారు అభినందనలు తెలియచేశారు. చికిత్స నిమిత్తం బాలుడిని ఆస్పత్రికి తరలించారు. 13 గంటల పాటు 100 అడుగుల లోతులో ప్రవీణ్ చిక్కుకపోయాడు. ఏప్రిల్ 13వ తేదీ మధ్యాహ్న సమయంలో ప్రవీణ్ బోరుబావిలో పడిపోయాడు. 

ఉత్తరప్రదేశ్‌లోని షేర్‌ఘర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని అగర్యాలకు చెందిన 5 ఏళ్ల ప్రవీణ్ బోరు బావిలో పడిపోయాడు. దయారాం, ప్రవీణ్ దంపతుల కుమారుడు.. స్నేహితులతో కలిసి ఇంటి సమీపంలోని పొలాల్లో ఆడుకుంటున్నాడు. ఏప్రిల్ 13వ తేదీ శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో.. ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. కాపాడేందుకు విఫలయత్నం చేశారు. సమాచారం అందుకున్న NDRF బృందాలు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

బాలుడి పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రత్యేక కెమెరాలను బోరు బావిలోకి పంపారు. 100 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. బాలుడు ప్రాణాలతోనే ఉన్నట్లు విజువల్స్ లో స్పష్టంగా కనిపించింది. స్పాట్‌కు చేరుకున్న ప్రత్యేక వైద్యుల బృందం బాలుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసింది. పైపుల ద్వారా ఆక్సీజన్ సరఫరా చేసింది. నిమిషాలు గడిచేకొద్ది బాలుడి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండటంతో.. రక్షణ చర్యలను ఎన్డీఆర్ బృందాలు ముమ్మరం చేశాయి. జేసీబీల సాయంలో బోరు బావికి సమాంతరంగా గొయ్యి తవ్వాయి. మొత్తానికి బాలుడు క్షేమంగా బయటకు రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.