Covid in Bengaluru: 543 మంది పిల్లలకు కరోనా..కేసులు పెరుగుతాయంటున్న అధికారులు
దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని సంబరపడుతున్నాం. థర్డ్ వేవ్ రాదని కొంతమంది డాక్టర్లు చెబుతుంటే ఈ మహమ్మారి పీడ విరగడి అయిపోతోందని సంతోషపడిపోతున్నాం. కానీ ఈ మాయదారి కరోనా మరో రూపంలోకి మారిందా?అనే భయాందోళనలు కలుగుతున్నాయి. ఎందుకంటే..కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా బారిన బారిన పడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. 543 మందికి కరోనా సోకింది.

Covid In Bengaluru
543 children test covid-19 : దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని సంబరపడుతున్నాం. థర్డ్ వేవ్ రాదని కొంతమంది డాక్టర్లు చెబుతుంటే ఈ మహమ్మారి పీడ విరగడి అయిపోతోందని సంతోషపడిపోతున్నాం. కానీ ఈ మాయదారి కరోనా మరో రూపంలోకి మారిందా?అనే భయాందోళనలు కలుగుతున్నాయి. ఎందుకంటే..కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా బారిన బారిన పడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. జులై నెలాఖరులో లేని కరోనా ఒక్కసారిగా పిల్లల్లో బైటపడుతోంది. దీంతో తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. ఆగస్ట్ 1 నుంచి 11 వరకు 0-19 ఏళ్ల వయసువారికి కరోనా సోకుతోంది. అలా ఇప్పటి వరకూ 543 మందికి కరోనా సోకింది. 0-9 ఏళ్ల చిన్నారుల్లో 88 మందికి, 10-19 ఏళ్ల పిల్లల్లో 305 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు గ్రేటర్ బెంగళూరు నగర మున్సిపల్ అధికారులు తెలిపారు.
499 కొత్త కేసుల్లో 263 కేసులు గత ఐదు రోజుల్లోనే నిర్ధారణ అయ్యిందని తెలిపారు.దీంతో కరోనా పిల్లలపాలిట మహమ్మారిగా మారిందా? అనే భయాందోళనలకు వ్యక్తమవుతున్నాయి. వీటిలో 88 కేసులు 9 ఏళ్ల లోపు చిన్నారులే కావటం గమనించాల్సిన విషయం. అలాగే 175 కేసులు 10-19 ఏళ్లవారున్నారు.ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే ఇప్పటి వరకూ కరోనా సోకినట్లుగా నిర్దారణ అయిన చాలా మంది పిల్లల్లో కరోనా లక్షణాలు లేకపోవడం. ఒక వేళ ఉన్నాగానీచాలా తేలికపాటి లక్షణాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కానీ కరోనా సోకిన పిల్లలు అందరూ బాగానే ఉన్నారని మరణాలు నమోదు కాలేదని తెలిపారు.
పిల్లల్లో కరోనా పరిస్థితి ప్రస్తుతం సాధారణంగానే ఉన్నా..ఇది ప్రమాదంగా మారే అవకాశాలున్నాయని బెంగళూరు ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్నారుల కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో ఈ మహమ్మారి మరింతగా పెరిగే అవకాశమున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటి వరకూ వ్యాక్సిన్ వేయించుకోని తల్లిదండ్రులు ఉంటే వెంటనే టీకా వేయించుకోవాలని, రద్దీ ప్రాంతాలకు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శానిటైజేషన్, మాస్కులను తప్పనిసరిగా పాటించాలని ఎంతో అవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు. పిల్లల విషయంలోమరింత శ్రద్ధ తీసుకోవాలని తల్లిదండ్రులకు అధికారులు సూచించారు.
ఒకపక్క బెంగళూరులో ఇటువంటి పరిస్థితి ఉంటే మరోపక్క 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్ చేయటానికి కర్ణాటక ప్రభుత్వం రెడీ కావటంతో పిల్లల గురించి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని కోరుతున్నారు.