5G Internet Services: మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి 5జీ సేవలు.. తొలుత ఏఏ నగరాల్లో అంటే.. హైదరాబాద్‌లో?
త్వరలో దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొదటి దశలో 13 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని, 5జీ లాంచ్ కోసం సన్నద్ధం కావాలని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను కోరారు.

5G network
5G Internet Services: త్వరలో దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల 5జీ స్పెక్ట్రమ్ వేలంలో టెలికాం కంపెనీలు ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, అదానీ డేటా నెట్ వర్క్, వొడా ఫోన్ ఐడియా సర్వీస్ ప్రొవైడర్లు పాల్గొన్నాయి. ఈ వేలంలో సుమారు రూ. 17,876 కోట్ల చెల్లింపును డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం ( డీఓటీ ) అందుకుంది. మొదటిగా డీఓటీ రేడియో తరంగాల విజయవంతమైన బిడ్డర్లు ముందస్తు చెల్లింపులను అదే రోజున స్పెక్ట్రమ్ అసైన్‌మెంట్ లేఖలను జారీ చేసింది. అదేవిధంగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద మాట్లాడిన ప్రధాని మోదీ 5జీ సేవల గురించి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాల్లో 5జీ, సెమీకండక్టర్ల తయారీ, ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌తో మేము డిజిటల్ ఇండియా ద్వారా అట్టడుగు స్థాయికి విప్లవాన్ని తీసుకువస్తున్నామని అన్నారు.
Jio 5G, JioPhone 5G : జియో 5G సేవలతో పాటు జియో ఫోన్ 5G వస్తోంది.. ఆగస్టు 29 లాంచ్ అయ్యే ఛాన్స్..!
తాజా నివేదిక ప్రకారం.. 5జీ సేవలు దశలవారీగా అందుబాటులోకి వస్తాయి. మొదటి దశలో 13 నగరాల్లో వేగవంతమైన 5జీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నగరాల్లో అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పూణే ఉన్నాయి.
29 సెప్టెంబర్ 2022న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) ప్రారంభోత్సవంలో భారత ప్రభుత్వం అధికారికంగా 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. 4G నెట్‌వర్క్ కంటే 5జీ నెట్‌వర్క్ సేవలు 10 రెట్లు వేగంగా ఉంటుంది. స్పెక్ట్రమ్ కేటాయింపు లేఖల జారీ తర్వాత 5జీ లాంచ్ కోసం సన్నద్ధం కావాలని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను కోరారు.