Mumbai Marathon: ముంబై మారథాన్ పూర్తి చేసిన 80 ఏళ్ల బామ్మ

ఈ బామ్మ మారథాన్ పరుగుకు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆమె మనువరాలు డింపుల్ మెహతా ఫెర్నాండెజ్ తన ఇన్‭స్టాలో ఈ వీడియో షేర్ చేస్తూ ‘‘మా బామ్మ సంకల్పం, ధైర్యానికి జోహార్లు. తనే మాకు స్ఫూర్తి’’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ‘యువతరానికి మీరు స్ఫూర్తి’ అంటూ అనేక మంది నెటిజెన్లు స్పందిస్తున్నారు. ‘స్టార్ బామ్మ’ అంటూ మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Mumbai Marathon: ముంబై మారథాన్ పూర్తి చేసిన 80 ఏళ్ల బామ్మ

80-yr-old woman running Mumbai marathon in saree, sneakers

Updated On : January 19, 2023 / 5:25 PM IST

Mumbai Marathon: సౌకర్యాలు పెరిగే కొద్ది మనిషికి సోమరితనం పెరుగుతోంది. అన్నీ అరచేతిలోకి వస్తే, కాలు కదపాల్సిన అవసరం ఏముంది కాబోలు.. అందుకే గత తరం వాళ్లతో పోల్చుకుంటే ఇప్పటి తరం వాళ్లు అంత బలంగా లేరని తరుచూ అంటుంటారు. కానీ, ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాల్సిందే. రోజంతా యాక్టివ్‭గా ఉండేవారు మిగతా వారి కంటే చాలా ధ్రుఢంగా ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతుంటారు. ఇక అసలు విషయంలోకి వస్తే.. ఒక కిలోమీటరు దూరం నడిచేందుకు తెగ ఆయాస పడిపోతుంటాం. అలాంటి 80 ఏళ్ల ఓ బామ్మ ఏకంగా 5 కిలోమీటర్ల మారథాన్ పూర్తి చేసింది. అంత వయసులో కూడా యువకులతో పాటు పోటీ పడి పరిగెత్తడం గమనార్హం.

Nitish Kumar: నాకున్నది ఆ ఒక్క ఆశ మాత్రమే.. కేసీఆర్ మీటింగ్ మరుసటి రోజు నితీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ముంబైలో ఏటా నిర్వహించే ‘టాటా మారథాన్’లో భారతి అనే 80 ఏళ్ల బామ్మ పాల్గొని అందరినీ ఆకట్టుకుంది. చీర కట్టుకుని, స్పోర్ట్స్ షూ ధరించిన ఆమె జాతీయ జెండా చేతబూని పరుగులు తీసింది. 51 నిమిషాల్లో 4.2 కిలోమీటర్ల పరుగు పూర్తి చేసింది. ఈ క్రమంలో కాసేపు వేగంగా కాసేపు నెమ్మదిగా పరుగు తీసింది. ఇక మరో విశేషం ఏంటంటే.. ఆమె మారథాన్ పరుగు తీయడం ఇదేం కొత్త కాదు. గతంలో ఐదు సార్లు ఈ పరుగులో పాల్గొన్నట్లు మారథాన్ అనంతరం మీడియాకు వెల్లడించింది. ఈ వయసులో కూడా రోజు ఉదయమే కాసేపు రన్నింగ్, వ్యాయామం చేస్తుందట. అదే తన మారథాన్ సీక్రెట్ అని వెల్లడించింది.

View this post on Instagram

A post shared by Dimple Mehta Fernandes ? (@inforstyle)

DMK On Governor: తమిళనాడు పేరు మార్పుపై గవర్నర్ క్షమాపణ చెప్పినా వెనక్కి తగ్గని డీఎంకే