Airport Checking: 80 ఏళ్ల వృద్ధురాలిని దుస్తులు తీయించి తనిఖీ చేసిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది

80 ఏళ్ల వృద్ధురాలిని దుస్తులు తీయించి ఎయిర్ పోర్ట్ CISF భద్రతా సిబ్బంది తనిఖీ చేసిన ఘటన ఇటీవల అస్సాంలోని గుహాటీ ఎయిర్ పోర్ట్ లో చోటుచేసుకుంది

Airport Checking: 80 ఏళ్ల వృద్ధురాలిని దుస్తులు తీయించి తనిఖీ చేసిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది

Old Woman

Updated On : March 26, 2022 / 7:12 AM IST

Airport Checking: తనిఖీ పేరుతో ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది..ఇంగిత జ్ఞానం మరిచారు. కదల్లేని పరిస్థితుల్లో చక్రాల కుర్చీకే పరిమితమైన 80 ఏళ్ల వృద్ధురాలిని దుస్తులు తీయించి ఎయిర్ పోర్ట్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) భద్రతా సిబ్బంది తనిఖీ చేసిన ఘటన ఇటీవల అస్సాంలోని గుహాటీ ఎయిర్ పోర్ట్ లో చోటుచేసుకుంది. నాగాలాండ్ కు చెందిన వృద్ధురాలు తన మానవరాలితో కలిసి ఇటీవల అస్సాం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే శస్త్రచికిత్స కారణంగా చక్రాల కుర్చీలో వచ్చిన వృద్ధురాలిని తనిఖీ పేరుతో CISF మహిళా భద్రతా సిబ్బంది ఇబ్బంది పెట్టారు. అదీ సరిపోదన్నట్టు గదిలోకి తీసుకువెళ్లి..వృద్ధురాలి లోదుస్తులు సైతం తీయించి..సర్జరీ కోసం తుంటికి వేసిన టైటానియం ఇంప్లాంట్ కు సంబంధించి ఆధారాలు చూపాలంటూ డిమాండ్ చేశారు.

Also Read:Insurance Cheating : ఇన్సూరెన్స్ పేరుతో ఘరానా మోసం.. రూ.3.5 కోట్లు వసూలు

దీనిపై వృద్ధురాలి కూతురు, ప్రముఖ రచయిత, ప్రముఖ ఆంథ్రపాలజిస్ట్ డాలీ కికాన్ స్పందిస్తూ గుహాటీ CISF సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లికి జరిగిన అవమానం పై డాలీ కికాన్ విచారం వ్యక్తం చేస్తూ.. విషయాన్నీ ట్విట్టర్ ద్వారా అస్సాం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళింది. తుంటికి శస్త్రచికిత్స జరిగిందని చెప్పిన తరువాత కూడా కదల్లేని స్థితిలో ఉన్న ఒక వృద్ధురాలిని ఇలా దుస్తులు తీయించి తనిఖీ చేయాల్సిన అవసరం ఏంటంటూ సంబంధిత అధికారులను, విమానయానశాఖను ట్విట్టర్ ద్వారా ప్రశ్నించింది డాలీ కికాన్.

Also Read:Puncture Guard Tyre : ఈ టైర్లకు పంక్చర్‌ అయితే.. సొంతంగా రిపేర్ చేసుకుంటాయి.. గాలి బయటకు పోదు..!

అయితే ఈ విషయంపై కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందిస్తూ ఘటనపై విచారణకు ఆదేశించారు. వృద్ధురాలి తనిఖీ విషయంలో CISF మహిళా భద్రతా సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించినట్లు తేలడంతో వారిని సస్పెండ్ చేశారు. అనంతరం CISF అధికారులు సైతం డాలీ కికాన్ ఆమె తల్లికి క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. అయితే ఈ ఘటనపై గుహాటీ ఎయిర్ పోర్ట్ అధికారి ఒకరు స్పందిస్తూ..డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) మార్గదర్శకాల ప్రకారమే తనిఖీలు చేస్తున్నామని..వృద్ధురాలు ముందుగా టైటానియం ఇంప్లాంట్ గురించి తమకు సమాచారం ఇవ్వలేదంటూ పేర్కొన్నారు.

Also read:Akhilesh Yadav : మా స్టేడియంలో మీ కొత్త ప్రభుత్వం ప్ర‌మాణ స్వీకారం… యోగికి అఖిలేశ్ చుర‌క‌లు