Akhilesh Yadav : మా స్టేడియంలో మీ కొత్త ప్రభుత్వం ప్ర‌మాణ స్వీకారం… యోగికి అఖిలేశ్ చుర‌క‌లు

Akhilesh Yadav : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయాన్ని సాధించింది. రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టిన పార్టీగా బీజేపీ అవతరించింది.

Akhilesh Yadav : మా స్టేడియంలో మీ కొత్త ప్రభుత్వం ప్ర‌మాణ స్వీకారం… యోగికి అఖిలేశ్ చుర‌క‌లు

Akhilesh Yadav Congratulates New Up Govt For Taking Oath At ‘sp Built Stadium’

Akhilesh Yadav : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయాన్ని సాధించింది. రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టిన పార్టీగా బీజేపీ అవతరించింది. యోగి ఆధిత్యనాథ్ నాయకత్వంలో బీజేపీ రెండోసారి కూడా యూపీలో అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. ఐదేళ్ల పూర్తి పదవీకాలం పూర్తయిన తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చిన యూపీలో మొదటి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ నిలిచారు. శుక్రవారం (మార్చి 25)న యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 37 ఏళ్లలో రాష్ట్రంలో మరే సీఎం కూడా ఈ ఘనత సాధించలేదు. ఈ సందర్భంగా లక్నోలో అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా క్రికెట్ స్టేడియంలో వేలాది  మంది ప్రజల సమక్షంలో యోగి రెండోసారి యూపీ సీఎంగా ప్రమాణం చేశారు. రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ యోగి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంగా యోగితో పాటు ఆయన మంత్రివర్గం కూడా ప్రమాణం చేసింది.

అదే సమయంలో యూపీలో విపక్ష నేత, స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేశ్ యాదవ్.. యోగి ప్రభుత్వానికి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. యోగి కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం ఏక్నా క్రికెట్ స్టేడియంలో జరిగింది. అయితే ఈ స్టేడియాన్ని మా హయాంలోనే కట్టించామన్నారు అఖిలేశ్. తాము కట్టించిన స్టేడియంలోనే బీజేపీ కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవం జరిగిందని అఖిలేశ్ ట్వీట్ చేశారు. కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. మేం నిర్మించిన స్టేడియంలో మీరు ప్రమాణ స్వీకారం చేశారు.

కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడానికే ఈ ప్రమాణ స్వీకారం కాదు.. ప్రజలకు మంచి పాలన అందించాడానికే విషయం గుర్తించుకోవాలని అఖిలేశ్ చురకలు అంటించారు. ఈ స్టేడియాన్ని సమాజ్ వాదీ హయాంలో నిర్మించడం జరిగిందన్నారు. 2018లో అఖిలేశ్ ప్రభుత్వం ఈ స్టేడియానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ పేరు పెట్టింది. ఈ స్టేడియంలో ఒక టీ20 మ్యాచ్ కూడా నిర్వహించారు. ఈ స్టేడియం కెపాసిటీ 50వేల మంది కూర్చునేంతగా నిర్మించారు.

యోగి ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేపీ మౌర్య ఓడినప్పటికి డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు.

Read Also : Yogi Adityanath Oath : రెండోసారి యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం