Dog Vs Tiger : వార్నీ ఎంత ధైర్యం..! పులిని నోట కరిచి ఈడ్చి పడేసిన కుక్క

పులిని నోటితో అదిమిప‌ట్టింది ఈడ్చేసిన కుక్క

Dog Vs Tiger : వార్నీ ఎంత ధైర్యం..! పులిని నోట కరిచి ఈడ్చి పడేసిన కుక్క

a dog trying to bite off tigers ear

Updated On : October 8, 2022 / 4:53 PM IST

Dog Vs Tiger : ఓ కుక్క‌ మరో కుక్కతో పోట్లాడటం చూసే ఉంటాం. కానీ ఓ కుక్క ఏకంగా పెద్దపులి చెవి నోట కరిచి ఈడ్చేయటం బహుశా ఎక్కడా చూసి ఉండం. పులి గాండ్రిస్తే పరుగు లంఘించుకోవాల్సిన కుక్క ఏకంగా పులి చెవు నోటితో పట్టుకుని ఈడ్చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఒకే ద‌గ్గ‌ర పులి, సింహం, కుక్క ఉన్నాయి. ఈ మూడు జంతువులు కూడా ఒక‌దానికొక‌టి మంచి స్నేహంతో ఉన్నాయి. ఇదే విశేషమంటే ఓ కుక్క క్రూర మృగాలైన సింహం, పులి మధ్య ఉన్నాననే భయమే లేకుండా అక్కడ ఉన్న పులి చెవి పట్టుకుని లాగుతోంది. ఈ పులి కూడా ఏమాత్రం కుక్కకు హాని చేయలేదు. ఏ వదులెహే అన్నట్లుగా కుక్కను ఏమి చేయలేదు.కుక్క ఈడ్చేస్తున్నా పులి మాత్రం ఏమీ చేయలేదు.
పులి చెవిని త‌న నోటితో అదిమిప‌ట్టింది కుక్క‌. పులి మాత్రం ఏం అన‌కుండా అలాగే కూర్చుండి పోయింది. సింహం కూడా కుక్కకు ఎలాంటి హానీ క‌లిగించ‌లేదు. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఇన్‌స్టా గ్రామ్‌లో ఎనిమల్స్ ప‌వ‌ర్ అనే పేజీలో ఈ వీడియోను పోస్టు చేశారు.

 

View this post on Instagram

A post shared by Animal Power (@animals_powers)