FIFA World Cup 2022: 1500 బిర్యానీలు ఉచితంగా పంచిన కేరళ వ్యాపారి.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
కేరళ రాష్ట్రం త్రిసూల్ జిల్లాలోని పల్లిమూల ప్రాంతంలో శిబు అనే వ్యక్తికి ఫుట్‌బాట్ క్రీడ అంటే చాలా ఇష్టం. అందులోనూ అర్జెంటీనా జట్టుతో పాటు మెస్సీ అంటే ప్రత్యేక అభిమానం. ఫైనల్ మ్యాచ్‍లో అతడు అనుకున్నట్లే అర్జెంటీనా విజేతగా నిలిచింది. దీంతో శిబు సోమవారం తన హోటల్ లో బిర్యానీలు ఉచితంగా పంపిణీ చేశాడు.

FiFa world Cup
FIFA World Cup 2022: ఖతార్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్రపంచకప్ ను గెలుచుకోవటంతో ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు సంబురాలు చేసుకున్నారు. భారత్ లోనూ అర్జెంటీనా జట్టు విజయంతో అభిమానులు సంబురాలు చేసుకున్నారు. అర్జెంటీనా జట్టు స్టార్ ఆటగాడు మెస్సీకి అభిమాని అయిన కేరళ వ్యాపారి.. అర్జెంటీనా వరల్డ్ కప్ గెలుచుకుంటే వెయ్యి బిర్యానీలు ఉచితంగా పంపిణీ చేస్తానని వాగ్దానం చేశాడు. అనుకున్నట్లే అర్జెంటీనా విజయంతో 1500 బిర్యానీలను ఉచితంగా స్థానికులకు అందజేశారు. ఈ బిర్యానీలకోసం స్థానికులు క్యూ కట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Fifa World Cup-2022: ఫ్రాన్స్, అర్జెంటీనా ఫుట్‌బాల్ షర్టులు ధరించి పెళ్లి చేసుకున్న అమ్మాయి, అబ్బాయి
కేరళ రాష్ట్రం త్రిసూల్ జిల్లాలోని పల్లిమూల ప్రాంతంలో శిబు అనే వ్యక్తికి ఫుట్ బాట్ అంటే చాలా ఇష్టం. అందులోనూ అర్జెంటీనా జట్టుతో పాటు మెస్సీ అంటే ప్రత్యేక అభిమానం. ఫైనల్ మ్యాచ్ లో అతడు అనుకున్నట్లే అర్జెంటీనా విజేతగా నిలిచింది. దీంతో శిబు సోమవారం తన హోటల్ లో బిర్యానీలు ఉచితంగా పంపిణీ చేశాడు. తొలుత వంద బిర్యానీలు ఉచితంగా పంచాలని అనుకున్నప్పటికీ.. భారీగా ప్రజలు బిర్యానీ ప్యాకెట్ల కోసం క్యూ కట్టడంలో అదనంగా మరో 500 కలిపి మొత్తం 1500 వరకు బిర్యానీలు అందించాల్సి వచ్చిందని శిబు తెలిపాడు.
https://twitter.com/untilitwasnt_/status/1604747788981800960?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1604747788981800960%7Ctwgr%5Efc40dd120f0c8e32b9ea7c611f5102f1ab31b60b%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.timesnownews.com%2Findia%2Fsharing-happiness-kerala-hotel-owners-biryani-gift-on-argentinas-fifa-world-cup-win-article-96350422
ఉచిత బిర్యానీల కోసం దాదాపు కిలో మీటరుకుపైగా క్యూలైన్ కనిపించడం గమనార్హం. ఈ విషయంపై శిబు మీడియాతో మాట్లాడుతూ.. 36ఏళ్ల తరువాత అర్జెంటీనా జట్టు విజయం సాధించడం సంతోషంగా ఉందని అన్నాడు. తొలుత వెయ్యి బిర్యానీలు పంచాలని అనుకున్నాను. కానీ, ప్రజలు భారీగా తరలిరావడంతో అదనంగా మరో 500 బిర్యానీలు అందజేయడం జరిగిందని శిబు తెలిపాడు.