Uniform Civil Code: ఉమ్మడి పౌరస్మృతిపై బీజేపీతో ఏకీభవించిన ఆప్.. మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన
దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడానికి ప్రయత్నించాలని భారత రాజ్యాంగంలోని 44 వ అధికరణ చెప్తోంది. దీనితో మేము (ఆప్) ఏకీభవిస్తున్నాం. అయితే, అన్ని మతాలు, రాజకీయ పార్టీలు, సంస్థలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయం తీసుకురావాలి

Aam Aadmi Party: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి చీటికీ మాటికీ కయ్యం పెట్టుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నట్టుండి మద్దతు తెలిపింది. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (Uniform Civil Code – UCC)పై బోఫాల్ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narndra Modi) చేసిన ప్రకటనతో దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. అయితే ఉమ్మడి పౌరస్మృతికి మద్దతు ఇస్తున్నట్లు ఆప్ ప్రకటించింది. అయితే దీనిపై అన్ని మతాలు, రాజకీయ పార్టీలు, సంస్థలతో విస్తృత చర్యలు జరపి ఏకాభిప్రాయానికి తీసుకురావాలని పేర్కొంది.
Pakistan: నా పేరు ఖాన్, నేను దేశద్రోహిని కాను.. మే 9నాటి అశాంతిపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ స్పందన
ఈ విషయమై ఆప్ నేత సందీప్ పట్నాయక్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ”దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడానికి ప్రయత్నించాలని భారత రాజ్యాంగంలోని 44 వ అధికరణ చెప్తోంది. దీనితో మేము (ఆప్) ఏకీభవిస్తున్నాం. అయితే, అన్ని మతాలు, రాజకీయ పార్టీలు, సంస్థలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయం తీసుకురావాలి” అని ట్వీట్ చేశారు.
Nandini vs Milma: కర్ణాటకలో కొనసాగుతున్న పాల రాజకీయం.. అమూల్‌పై గెలిచి మిల్మా ముందు తలొగ్గిన నందిని
భోపాల్‌లో బీజేపీ మంగళవారం నిర్వహించిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. దేశ ప్రజలందరికీ ఒకే చట్టం అమలుకావాలన్నారు. రెండు రకాల చట్టాలతో కుటుంబం మనుగడ కొనసాగగలదా? అని ప్రశ్నించారు. ఉమ్మడి పౌర స్మృతి దేశానికి అవసరమని తెలిపారు. కాగా, దేశంలోని అనేక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఉమ్మడి పౌరస్మృతి మీద చర్చను ప్రధాని లేవనెత్తారంటూ కాంగ్రెస్, డీఎంకే, మజ్లిస్ పార్టీలు మండిపడ్డాయి.