AAP-Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఎగిరిన ఆప్ జెండా
ఆమ్ ఆద్మీ పార్టీ జెండా మధ్యప్రదేశ్ ఎన్నికల్లోనూ రెపరెపలాడింది. మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేసిన తొలి సారే విజయకేతనం ఎగరేసింది. సింగ్రౌలీ నుంచి పోటీచేసి మేయర్ సీట్ గెలిచారు ఆప్ అభ్యర్థి రాణి అగర్వాల్. భారతీయ జనతాపార్టీ అభ్యర్థి ప్రకాశ్ విశ్వకర్మపై 9వేల 352 ఓట్ల తేడాతో ఓడించగా, మూడో స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలిచింది.

Aap Will Form Its Next Government In Karnataka
AAP-Madhya Pradesh: ఆమ్ ఆద్మీ పార్టీ జెండా మధ్యప్రదేశ్ ఎన్నికల్లోనూ రెపరెపలాడింది. మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేసిన తొలి సారే విజయకేతనం ఎగరేసింది. సింగ్రౌలీ నుంచి పోటీచేసి మేయర్ సీట్ గెలిచారు ఆప్ అభ్యర్థి రాణి అగర్వాల్. భారతీయ జనతాపార్టీ అభ్యర్థి ప్రకాశ్ విశ్వకర్మపై 9వేల 352 ఓట్ల తేడాతో ఓడించగా, మూడో స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలిచింది.
రాణి అగర్వాల్ చాలా కాలంగా సామాజిక సేవ, రాజకీయాల్లోనే ఉన్నారు. 2014లో జిల్లా పంచాయతీ సభ్యురాలిగా మొదటి సారి ఎన్నికల్లో గెలిచారు. అగర్వాల్ సింగ్రౌలి స్థానం నుండి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమె తరపున రోడ్ షోలో ప్రచారం చేశారు.
Read Also: గుజరాత్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. 850 మంది పదాధికారులను నియమించిన ఆప్
అగర్వాల్ విజయం తర్వాత, అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్‌లో ఆమెను అభినందిస్తూ, “సింగ్రౌలీ మేయర్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి రాణి అగర్వాల్ జీ, ఇతర విజేతలు, పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తున్నా. మీ ప్రజల కోసం కష్టపడి పనిచేయండి. దేశవ్యాప్తంగా ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయితీ రాజకీయాలు ఆదరిస్తున్నారు” అని పేర్కొన్నారు.
బీజేపీ నుంచి పోటీచేసిన ఇతర మేయర్ అభ్యర్థులు బుర్హాన్పూర్, సత్నా, ఖాంద్వా లు విజయం సాధించారు. జులై 6న జరిగిన ఎన్నికల కౌంటింగ్ జులై 17 ఆదివారం జరుగుతుంది.