Atishi : ఢిల్లీ అసెంబ్లీలో చరిత్ర సృష్టించిన అతీశీ.. మొట్ట మొదటి మహిళ..

ఢిల్లీ అసెంబ్లీ తొలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

Atishi : ఢిల్లీ అసెంబ్లీలో చరిత్ర సృష్టించిన అతీశీ.. మొట్ట మొదటి మహిళ..

Updated On : February 23, 2025 / 4:34 PM IST

Atishi : ఆప్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతీశీ ఢిల్లీ అసెంబ్లీలో చరిత్రలో సృష్టించారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఆమె ఎంపికయ్యారు. ఒక మహిళను ఈ పాత్రకు ఎంపిక చేయడం ఇదే మొట్ట మొదటిసారి. అంతేకాదు, రాబోయే అసెంబ్లీ సెషన్‌లో ఒక మహిళా ప్రతిపక్ష నాయకురాలు ఒక మహిళా ఢిల్లీ ముఖ్యమంత్రిని చరిత్రలో మొదటిసారిగా ఎదుర్కోనున్నారు.

ఈరోజు జరిగిన ఆప్ శాసనసభ సమావేశంలో అతీశీని ప్రతిపక్ష నాయకురాలిగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే సంజీవ్ ఝా ఆమె పేరును కీలక పదవికి ప్రతిపాదించారు.

తనను ప్రతిపక్ష నేతగా ఎంపిక చేయడం పట్ల అతీశీ స్పందించారు. తనపై విశ్వాసం ఉంచినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కి, శాసనసభా పక్షానికి ధన్యవాదాలు తెలిపారు అతీశీ. బలమైన ప్రతిపక్షం ప్రజల గొంతుకను పెంచుతుందన్నారామె. బీజేపీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేలా ఆమ్ ఆద్మీ పార్టీ ఒత్తిడి చేస్తుందని అతీశీ అన్నారు.

Also Read : గుడ్ న్యూస్.. అమెరికా ప్రొడక్ట్స్ పై ట్యాక్స్ తగ్గింపు.. ఇవన్నీ రేట్లు తగ్గుతాయ్..

ఢిల్లీ అసెంబ్లీ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల సెషన్‌లో, గత ఆప్ ప్రభుత్వ పనితీరుపై పెండింగ్‌లో ఉన్న కాగ్ నివేదికలను సభలో ప్రవేశపెడతామని అధికార బీజేపీ ప్రభుత్వం తెలిపింది.

ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను 48 స్థానాలను గెలుచుకోవడం ద్వారా దేశ రాజధానిలో అధికారంలోకి వచ్చింది. ఆప్ 22 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ దారుణంగా విఫలమైంది.

కల్కాజీ నియోజకవర్గంలో బీజేపీ చెందిన రమేశ్ బిధూరిపై అతీశీ గెలుపొందారు. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాతో సహా పలువురు ఆప్ కీలక నేతలు ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు.