అభినందన్ కు ‘భగవాన్ మహవీర్ అహింసా పురస్కారం’

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కు ‘భగవాన్ మహవీర్ అహింసా పురస్కారం’ అందిస్తున్నట్లు ‘అఖిల భారతీయ దిగంబర జైన సమితిఆదివారం(మార్చి-3,2019) ప్రకటిచింది.ఏప్రిల్ 17న వర్ధమాన మహావీర జయంతి సందర్భంగా ఈ అవార్డును అభినందన్‌కు అందజేయనున్నట్లు ఈ సంస్థ మహారాష్ట్ర కన్వీనర్ పరాస్ లోహడే తెలిపారు. ఈ ఏడాదే ప్రవేశపెట్టిన .ఈ అవార్డు అందుకోబోతున్న మొట్టమొదటి వ్యక్తి అభినందన్ అని ఆయన తెలిపారు. ఈ అవార్డు కింద రూ.2.51 లక్షల నగదుతో పాటు జ్ఞాపిక కూడా అందచేయనున్నారు. పాక్ నిర్బందంలో నుంచి విడుదలై శుక్రవారం భారత్ లో అభినందన్ అడుగుపెట్టిన విషయం తెలిసిందే.