EAM Jaishankar : కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌కు జడ్ కేటగిరి భద్రత
కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ భద్రతను కేంద్రం అప్‌గ్రేడ్ చేసింది. ఖలిస్థానీ ఉగ్రవాదుల పోస్టర్లు వేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి జైశంకర్ భద్రతను వై నుంచి జడ్ కేటగిరీకి పెంచింది.....

EAM Jaishankar
EAM Jaishankar : కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ భద్రతను కేంద్రం అప్‌గ్రేడ్ చేసింది. ఖలిస్థానీ ఉగ్రవాదుల పోస్టర్లు వేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి జైశంకర్ భద్రతను వై నుంచి జడ్ కేటగిరీకి పెంచింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భద్రతను వై కేటగిరీ నుంచి జడ్ కేటగిరికి అప్‌గ్రేడ్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రికి ఉన్న ముప్పు గురించి కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read :X removes : ఎక్స్ సంచలన నిర్ణయం…వందలాది హమాస్ ఉగ్రవాదుల ఖాతాల తొలగింపు
ఇప్పటివరకు ఢిల్లీ పోలీసుల భద్రత ఉన్న కేంద్రమంత్రికి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ భద్రత కల్పించాలని కేంద్రం ఆదేశించింది. కేంద్రమంత్రికి డజనుకు పైగా సాయుధ కమాండోలు దేశవ్యాప్తంగా షిఫ్టులలో 24 గంటల పాటు రక్షకులుగా ఉంటారు. ప్రస్థుతం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు వీఐపీ భద్రత కల్పించారు.