ట్వింకిల్ చేరబోయే పార్టీ ఇదే

  • Published By: venkaiahnaidu ,Published On : April 26, 2019 / 07:09 AM IST
ట్వింకిల్ చేరబోయే పార్టీ ఇదే

Updated On : April 26, 2019 / 7:09 AM IST

బాలీవుడ్‌ నటి, అక్షయ్‌ కుమార్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా బీజేపీలో చేరబోతున్నారా? అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సందేశాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అక్షయ్‌.. మోడీతో నాన్ పొలిటికల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న విషయం తెలిసిందే.

ఇంటర్వ్యూ సమయంలో సోషల్ మీడియా గురించిన అంశాన్ని అక్షయ్ ప్రస్తావించారు.దీనికి సమాధానంగా మోడీ అక్షయ్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నాను  ఉద్దేశిస్తూ.. ‘మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉంటారనుకుంటా. ఎందుకంటే మీ భార్య ఎప్పుడూ నన్ను తిడుతుంటారు కదా..’ అని అక్షయ్‌ తో చమత్కరించారు.  
Also Read : అంతా భ్రాంతియేనా : విడిపోయిన ప్రేమ పక్షులు

దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందించిన ట్వింకిల్‌ ఖన్నా…మోడీ కామెంట్స్‌ ను తాను పాజిటివ్‌గా తీసుకుంటానని తెలిపారు. దీంతో ఆమె బీజేపీలో చేరే అవకాశం ఉందని, అందుకే ఆమె మోడీపై ఎలాంటి కామెంట్స్ చేయలేదని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఈ కామెంట్ల పై శుక్రవారం(ఏప్రిల్-26,2019) ట్విట్టర్ ద్వారా స్పందించిన ట్వింకిల్…ఎక్కువ కాదు.. తక్కువ కాదు.. స్పందన అనేది ఎప్పుడూ ప్రచారం కిందికి రాదు. నేను చేరే ఏకైక పార్టీలో ఎక్కువగా వోడ్కా(మద్యం) షాట్స్‌ ఉంటాయి. ఆ తర్వాత రోజు హ్యాంగోవర్‌ ఉంటుంది అంటూ తనదైన స్టైల్ లో సమాధానమిచ్చారు.
Also Read : కాళ్లకు నమస్కరించి : మాయా బ్లెస్సింగ్స్ తీసుకున్న అఖిలేష్ భార్య