Rahul Gandhi: బ్రిటీష్ వారు సైతం కాంగ్రెస్ స్వరాన్ని అణచలేకపోయారు – రణదీప్ సర్జేవాలా

నేషనల్ హెరాల్డ్ కేసు విచారణకు కొద్ది గంటల ముందు కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సోమవారం విచారణ చేపటనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పలు రాష్ట్రాల్లో ఉన్న ఈడీ కార్యాలయాలకు పాదయాత్రగా వెళ్లి తమ నిరసన వ్యక్తం చేయాలని అనుకున్నారు.

Rahul Gandhi: బ్రిటీష్ వారు సైతం కాంగ్రెస్ స్వరాన్ని అణచలేకపోయారు – రణదీప్ సర్జేవాలా

Rahul Gandhi

Updated On : June 13, 2022 / 10:55 AM IST

Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు విచారణకు కొద్ది గంటల ముందు కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సోమవారం విచారణ చేపటనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పలు రాష్ట్రాల్లో ఉన్న ఈడీ కార్యాలయాలకు పాదయాత్రగా వెళ్లి తమ నిరసన వ్యక్తం చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలో దేశ రాజధానిలో పాదయాత్ర చేసేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో సర్జేవాలా ఈ విధమైన కామెంట్లు చేశారు.

“రాహుల్ గాంధీ నేతృత్వంలో సత్యా కా సంగ్రామ్ కొనసాగనుంది. స్వాతంత్ర్య సంగ్రామ పోరులో బ్రిటీష్ వాళ్లు సైతం కాంగ్రెస్ స్వరాన్ని అణచలేకపోయారు. అలాంటిది అధికార పార్టీకి అదెలా సాధ్యం కాగలదు” అని సర్జేవాలా అన్నారు.

రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ కార్యకర్తలంతా శాంతియుతంగా ఈడీ ఆఫీసుకు పాదయాత్రగా వెళ్తారని సర్జేవాలా అన్నారు. “మేం రాజ్యాంగ పరిరక్షకులం. భారీ పోలీసు బలగాలను చూసి భయపడి తలలు వంచం. మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ ను చూసి భయపడిందని రుజువైంది” అని సర్జేవాలా అన్నారు.

Read Also: నిరాధార ఆరోప‌ణ‌ల‌పై రాహుల్ గాంధీకి ఈడీ స‌మ‌న్లు: చిదంబ‌రం

పోలీసులను భారీగా ఏర్పాటు చేయడం, అన్ సెంట్రల్ ఢిల్లీలో డిక్లేర్డ్ ఎమర్జెన్సీ ఖరారు చేయడాన్ని సర్జేవాలా తప్పుబట్టారు. కాంగ్రెస్ ను చూసి మోదీ ప్రభుత్వం వణికిపోతుందని తెలుస్తుందని సర్జేవాలా పేర్కొన్నారు.