కూలిన మిగ్-27…మూడు నెలల్లో తొమ్మిదవది

  • Published By: venkaiahnaidu ,Published On : March 31, 2019 / 10:24 AM IST
కూలిన మిగ్-27…మూడు నెలల్లో తొమ్మిదవది

Updated On : March 31, 2019 / 10:24 AM IST

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన మిగ్‌-27 యుద్ధ విమానం కూలిపోయింది.ఆదివారం(మార్చి-31,2019)ఉదయం రాజస్థాన్‌ లో ఈ ప్రమాదం జరిగింది.

ఆదివారం ఉదయం రాజస్థాన్ లోని బర్మాన్ లోని ఉత్తరలయ్ ఎయిర్ బేస్ నుంచి బయల్దేరిన సోవియట్ కాలం నాటి అప్ గ్రేడెడ్ మిగ్‌-27 UPG విమానం దక్షిణ జోధ్‌పూర్‌ కు 120 కిలోమీటర్ల దూరంలో సిరోహి జిల్లాలోని షియోగంజ్ టూన్ దగ్గర్లోని గోదానా ప్రాంతంలో కూలిపోయింది.ఉదయం 11:45గంటలకు ఈ ప్రమాదం జరిగింది.అయితే ఈ ప్రమాదం నుంచి పైలట్‌ సురక్షితంగా బయటపడ్డాడు.ఘటనపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.ఇటీవల మిగ్‌ విమానాలు కూలిపోయిన ఘటనలు ఎక్కువవుతున్నాయి.గడిచిన మూడు నెలల్లో ఇది తొమ్మిదవ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ క్రాష్. బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన దాడి అనంతరం భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన పాక్‌ విమానాలను తిప్పికొట్టే క్రమంలో ఫిబ్రవరి-27,2019న వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ నడిపిన  మిగ్‌-21ను కూడా భారత్‌ కోల్పోయింది. 

జనవరి నుంచి మొత్తంగా… ఒక జాగ్వార్ యుద్ధ విమానం,రెండు మిగ్-27UPGS,రెండు హవక్ ఫైటర్స్,సూర్యకిరణ్ స్క్వాడ్రన్, అప్ గ్రేడెడ్ ట్విన్ సీట్ మిరాజ్-2000,మిగ్-21 బిసన్ ఫైటర్ లను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోల్పోవలసి వచ్చింది.