Maharasthra Politics: పార్టీ కార్యక్రమం ఫ్లెక్సీలో కనిపించని అజిత్ పవార్.. పూర్తిగా పక్కన పెట్టేశారా?
అజిత్ పవార్‌ను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నారనే విమర్శలు చాలా రోజులుగా వస్తూనే ఉన్నాయి. ఇందుకు తగ్గట్టు కొద్ది రోజుల క్రితం తనకు అసెంబ్లీ ప్రతిపక్ష హోదా ఒద్దని, పార్టీలో ఏదైనా పదవి ఇవ్వాలంటూ స్వయంగా అజిత్ పవారే మీడియా ముందు చెప్పడం చర్చనీయాంశమైంది.

Nationalist Congress Party: నేషనలిస్ట్ పార్టీ కార్యాయలంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీనియర్ నేత అజిత్ పవార్ ఫొటో కనిపించలేదు. పార్టీ చీఫ్ శరద్ పవార్ సహా వర్కింగ్ ప్రెసిడెంట్లు అయిన ప్రఫుల్ పటేల్, సుప్రియా సూలే ఫొటోలు మాత్రమే ఉన్నాయి. దీంతో పార్టీలోనే కాకుండా రాజకీయ వర్గాల్లో చర్చ దారి తీసుకుంది. కొద్ది రోజులుగా పార్టీలో అజిత్ పవార్ స్థానంపై తీవ్ర చర్చ జరుగుతోంది. వర్కింగ్ ప్రెసిడెంటుగా సుప్రియాకు స్థానం ఇచ్చి, అజిత్ పవార్‌కు ఎలాంటి స్థానం కల్పించకపోవడంపై కూడా పెద్ద ఎత్తునే చర్చ జరిగింది.
Pakistan: నా పేరు ఖాన్, నేను దేశద్రోహిని కాను.. మే 9నాటి అశాంతిపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ స్పందన
అజిత్ పవార్‌ను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నారనే విమర్శలు చాలా రోజులుగా వస్తూనే ఉన్నాయి. ఇందుకు తగ్గట్టు కొద్ది రోజుల క్రితం తనకు అసెంబ్లీ ప్రతిపక్ష హోదా ఒద్దని, పార్టీలో ఏదైనా పదవి ఇవ్వాలంటూ స్వయంగా అజిత్ పవారే మీడియా ముందు చెప్పడం చర్చనీయాంశమైంది. ప్రఫుల్ పటేల్, సుప్రియా సూలేలకు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించిన రెండ్రోజులకు ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే వారిని నియమించిన కమిటిలో అజిత్ పవార్ కూడా ఉన్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా శరద్ పవార్ చెప్పారు.
Nandini vs Milma: కర్ణాటకలో కొనసాగుతున్న పాల రాజకీయం.. అమూల్‌పై గెలిచి మిల్మా ముందు తలొగ్గిన నందిని
ఇక తాజాగా పార్టీ ఢిల్లీ కార్యాలయంలో నేషలనిస్ట్ మహిళా కాంగ్రెస్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగులో అజిత్ పవార్ ఫొటో కనిపించలేదు. అయితే పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుందనే విషయం తెలియదు. దీనితో పాటు పార్టీలో ఓబీసీ నేతలకు సముచిత స్థానం కల్పించడం లేదన్న విమర్శలు సైతం వస్తున్నాయి. దీనిపై శరద్ పవార్ స్పందిస్తూ “పార్టీ స్థాపించిన అనంతరం మొదటి రాష్ట్ర ఎన్సీపీ చీఫ్ ఛగన్ భుజ్‌బల్. ఆయన తర్వాతమధుకర్రావు పిచాడ్, ఆ తర్వాత సునీల్ తట్కరే లాంటి వారంతా ఓబీసీలే. అవగాహన లేకుండా మాట్లాడొద్దు” అని అన్నారు.