ఏ బటన్ నొక్కినా బీజేపీకే : EVMల పనితీరుపై అఖిలేష్ ఫైర్

  • Published By: venkaiahnaidu ,Published On : April 23, 2019 / 07:47 AM IST
ఏ బటన్ నొక్కినా బీజేపీకే : EVMల పనితీరుపై అఖిలేష్ ఫైర్

Updated On : April 23, 2019 / 7:47 AM IST

ఈవీఎంల పనితీరుపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఫైర్ అయ్యారు.దేశవ్యాప్తంగా ఈవీఎంలు మొరాయిస్తున్నాయని, ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు పడుతుందని అఖిలేష్ ట్వీట్ చేశారు. పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియడం లేదన్నారు. ఇప్పటికే 350కి పైగా ఈవీఎంలను మార్చారని తెలిపారు. ఇది నేరపూరిత నిర్లక్ష్యమని అఖిలేష్ మండిపడ్డారు. ఎన్నికల కోసం రూ. 50 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు.సార్వత్రిక ఎన్నికల మూడో ఫేజ్ లో భాగంగా దేశవ్యాప్తంగా 117 లోక్ సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగుతుంది.ఉత్తరప్రదేశ్ లోని 10లోక్ సభ స్థానాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతుంది.