Delhi : మ్రోగిన బడి గంటలు..స్కూళ్లు తెరుచుకున్నాయి

దేశ రాజధాని ఢిల్లీలో 2020, మార్చి తర్వాత..పాఠశాలలు తెరుచుకున్నాయి. 50 శాతం సామర్థ్యంతో హైబ్రిడ్ మోడల్ లో పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అందుబాటులోకి వచ్చాయి.

Delhi : మ్రోగిన బడి గంటలు..స్కూళ్లు తెరుచుకున్నాయి

Delhi Schools

Updated On : November 1, 2021 / 11:33 AM IST

All Schools In Delhi : కరోనా కారణంగా ఇన్ని రోజులు మూతపడిన బడులు మళ్లీ తెరుచుకున్నాయి. దీంతో తమ తమ పిల్లలను స్కూలు బ్యాగులు, టిఫిన్లు సర్ది..పాఠశాలలకు పంపిస్తున్నారు. కరోనా కారణంగా..నియమ నిబందనలు పాటిస్తూ…స్కూళ్లకు పంపించాలని అధికారులు సూచించిన సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో 2020, మార్చి తర్వాత..పాఠశాలలు తెరుచుకున్నాయి. 50 శాతం సామర్థ్యంతో హైబ్రిడ్ మోడల్ లో పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అందుబాటులోకి వచ్చాయి.

Read More : TSPECET 2021 : నేడే ఫలితాలు విడుదల

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ…విద్యార్థులను పాఠశాలలకు పంపించాలని తల్లిదండ్రులు సూచించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా…తరగతి గదుల్లో టేబుళ్లు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ఒకటి నుంచి 8వ తరగతులకు సోమవారం నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. అయితే…పాఠశాలలు ఓపెన్ చేసినా…ఆన్ లైన్ తరగతులు కొనసాగుతాయని అక్కడి విద్యాశాఖ స్పష్టం చేసింది. నవంబర్ 01వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తెరుచుకొనేందుకు ఢిల్లీ మేనేజ్ మెంట్ అథార్టీ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Read More : Puneeth Rajkumar : పెళ్లి మండపంలో పునీత్ కి నివాళులు అర్పించిన కొత్తజంట

పలు నియమ, నిబంధనలు విధించింది. తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రాలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని, తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్, ప్రత్యేక భోజన విరామాలు ఏర్పాటు చేయాలని సూచించింది. కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో విధించిన కంటైన్ మెంట్ జోన్ లోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పాఠశాలలకు రావొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత సంవత్సరం జనవరిలో 09-12 తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చినా…మరలా వైరస్ విజృంభించడంతో పాఠశాలలను మూసివేశారు. మరోవైపు చాలా మంది తల్లిదండ్రుల నుంచి సమ్మతి లేఖలు అందలేదని తెలుస్తోంది.