Mumbai : గాలిలో తేలుతున్న భవనం.. నిజమేనా?
మనం ఉండే ఇల్లు గాల్లో తేలియాడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి.. ఇలాంటి ఆలోచన వచ్చిన ఓ ఆర్టిస్ట్ AI సాయంతో అద్భుతాన్ని క్రియేట్ చేసాడు. గాల్లో తేలియాడే భవనాన్ని క్రియేట్ చేసాడు.

Mumbai
Mumbai : నీటి మీద, కొండలపైన భవనాలు ఉండటం చూసి ఉంటారు.. బిల్డింగ్ గాలిలో తేలుతూ ఉంటే? ఒకసారి ఊహించండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఓ ఆర్టిస్ట్ క్రియేట్ చేసిన ఆ భవనం చూస్తే అదిరిపోయింది అంటారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వ్యక్తులు అద్భుతమైన కళాకృతులు రూపొందిస్తున్నారు. ప్రతీక్ అరోరా (_prateekarora) అనే కళాకారుడు ముంబయిలో భవనాలు గాలిలో తేలుతూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించి రూపొందించారు. మిడ్ జర్నీని ఉపయోగించి రూపొందించిన ఈ చిత్రాన్ని ‘ముంబయి అధివాస్తవికమైన ఎస్టేట్’ అనే శీర్షికతో పోస్ట్ చేసారు. ఇంటర్నెట్ వినియోగదారులు ఈ చిత్రాలను చూసి మంత్రముగ్ధులైపోయారు.
కూల్.. అద్భుతం అంటూ కామెంట్లు పెట్టారు. అతని టాలెంట్‌ని ప్రశంసించారు. ముంబయి ఇండియాలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటి. ఇక్కడ ఇళ్ల అద్దెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చిన్న చిన్న అపార్టె మెంట్లలో ప్రజలు ఉండాల్సి వస్తోంది. గతంలో సౌత్ ముంబయిలో తన ఇరుకైన సింగిల్ బెడ్రూమ్ అపార్ట్‌మెంట్ హోం టూర్‌ను ఓ వినియోగదారుడు చూపించాడు. ఆ వీడియో కూడా వైరల్ అయ్యింది. అక్కడ గృహాలకు ఎంత డిమాండ్ ఉందో కళ్లకు కట్టింది.
View this post on Instagram