Karnataka CM’s post: ఇప్పటికే సిద్ధరామయ్య-డీకే శివకుమార్ పోటీ.. ఇప్పుడు మరొకరి డిమాండ్
వాస్తవాలను దృష్టిలో పెట్టకుని తమ నాయకుడినే కర్ణాటక సీఎం పదవికి ఎంపిక చేయాలని ఆ మహాసభ కోరింది.

Siddaramaiah-DK Shivakumar
Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం ఇప్పటికే సిద్ధరామయ్య (Siddaramaiah)-డీకే శివకుమార్ (DK Shivakumar) పోటీ పడుతుండగా. ఇప్పుడు మరోవైపు నుంచి డిమాండ్ వస్తోంది. “సీఎం పదవి మాలో ఒకరికి ఇవ్వండి” అంటూ కాంగ్రెస్ (Congress) అధిష్ఠానానికి లింగాయత్ కమ్యూనిటీకి చెందిన ఆలిండియా వీరశైవ మహాసభ ( All India Veershaiva Mahasabha) లేఖ రాసింది.
కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికైన 34 మంది లింగాయత్ కమ్యూనిటీకి చెందిన వారేనని ఆలిండియా వీరశైవ మహాసభ గుర్తు చేసింది. కాంగ్రెస్ గెలుపులో తాము ప్రధాన పాత్ర పోషించామని చెప్పింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఈ మేరకు లేఖలో పలు వివరాలు తెలిపింది.
కాంగ్రెస్ పార్టీ 46 మంది లింగాయత్ కమ్యూనిటీకి చెందిన వారు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే వారిలో 34 మంది గెలిచారని ఆలిండియా వీరశైవ మహాసభ లేఖలో పేర్కొంది. కర్ణాటకలోని దాదాపు 50 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ గెలుపు వెనుక తమ పాత్ర ఉందని చెప్పింది. అంతేగాక, తమ కృషి వల్ల బీజేపీ సాంప్రదాయ ఓటర్లు అందరూ కాంగ్రెస్ వైపు మళ్లారని, దీంతో 135 నియోజక వర్గాల్లో హస్తం పార్టీ గెలుపు సాధ్యమైందని చెప్పారు.
కాగా, దావణగెరె సౌత్ నుంచి పోటీ చేసిన 91 ఏళ్ల నేత శమణురు శివశంకరప్ప ఆలిండియా వీరశైవ మహాసభ అధ్యక్షుడు. ఈ అన్ని వాస్తవాలను దృష్టిలో పెట్టకుని ఓ వీరశైవ లింగాయత్ కమ్యూనిటీ నాయకుడికే కర్ణాటక సీఎం పదవికి ఎంపిక చేయాలని ఆ మహాసభ కోరింది.
Nikhil Siddhartha : అమిత్ షా నన్ను పిలిచారు.. రాజకీయం చేస్తారనే నేను కలవలేదు..