Amitabh Bachchan: ఇండియా పేరు మార్పు పక్కా? అమితాబ్ బచ్చన్ సైతం ట్వీట్
ఇండియాను ఇక భారత్ అని పిలవాలంటూ కొన్ని రోజులుగా బీజేపీ నేతలతో పాటు పలువురు ప్రముఖులు వ్యాఖ్యలు చేస్తున్నారు.

Amitabh Bachchan
Amitabh Bachchan – Bharat: కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న వేళ.. ఇండియా పేరును భారత్‌గా మార్చుతారని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో బాలీవుడ్ (Bollywood)దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. భారత్ మాతా కీ జై అని ఆయన ట్విటర్‌లో పేర్కొంటూ మన దేశ త్రివర్ణ పతాక ఎమోజీని పోస్ట్ చేశారు.
భారత్ పేరును కాంగ్రెస్ పార్టీ అనవసరంగా వివాదాస్పదం చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డ విషయం తెలిసిందే. భారత్ మాతా కీ జై నినాదాన్ని ఎందుకు ద్వేషిస్తున్నారని ఆయన నిలదీశారు. అదే నినాదంతో అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేయడం గమనార్హం.
ఇండియాను ఇక భారత్ అని పిలవాలంటూ కొన్ని రోజులుగా బీజేపీ నేతలతో పాటు పలువురు ప్రముఖులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇండియాకు బదులుగా భారత్ పేరును వాడాలని ఇటీవలే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ కూడా అన్నారు. దేశం పేరును మార్చుతున్నారని ప్రముఖులకు ఇప్పటికే సమాచారం అందిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
T 4759 – ?? भारत माता की जय ?
— Amitabh Bachchan (@SrBachchan) September 5, 2023
Bharat: ఇండియా పేరు భారత్ గా మార్పు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తీర్మానం!?