Amul పసుపు Ice Cream..టేస్ట్ ఎలా ఉంది

  • Published By: madhu ,Published On : August 3, 2020 / 10:50 AM IST
Amul పసుపు Ice Cream..టేస్ట్ ఎలా ఉంది

ప్రస్తుతం కరోనా టైం నడుస్తోంది. ఈ వైరస్ నుంచి కాపడుకొనేందుకు ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. వేడి వేడి పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచించడంతో చల్లని పదార్థాలను తాత్కాలికంగా పక్కకు పెట్టేస్తున్నారు. దీంతో చల్లటి కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్స్ సేల్స్ ఢమాల్ అయిపోయాయి.



ఆరోగ్యం కోసం చల్లనివి తాగకూడదని, తినకూడదంటూ…వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో Amul వినూత్నంగా ఆలోచించింది. కస్టమర్ల కోసం హెల్దీ ఐస్ క్రీం మార్కెట్ లోకి తీసుకొచ్చింది. పసుపుతో ఈ ఐస్ క్రీం ఉంది. ఈ ఐస్ క్రీమ్ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని యాజమాన్యం చెబుతోంది.

తులసి, పసుపు, అల్లం, పాలు, తేనే, బాదం, ఖర్జూరం లాంటి మిశ్రమాలున్నాయని వెల్లడించింది. దీంతో ఆరోగ్యం కోసం ఎలాంటి బెంగ అవసరం లేదని తెలిపింది. 125 ml హల్దీ ఐస్ క్రీమ్ ధర రూ. 40 గా ఉంది.



కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా రోగ నిరోధక శక్తినిచ్చే ఆహార పదార్థాలను తీసుకోవాలంటున్నారు. అల్లం, పసుపు, తులసి, మిరియాలు, లవంగాలు ఇతరత్రా వాటిని వేసుకుని కషాయం తయారు చేస్తూ తీసుకుంటున్నారు.

వేడి వేడి నీళ్లలో పసుపు వేసి తాగుతున్నారు. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందంటున్నారు. తాజగా అమూల్ సంస్థ తీసుకొచ్చిన హల్దీ ఐస్ క్రీమ్ ను ప్రజలు ఆదరిస్తారా ? లేదా ? అనేది చూడాలి.