Gujarat : బదిలీపై వెళ్తున్న తెలుగు ఎస్పీకి అపూర్వ వీడ్కోలు.. గుజరాత్‌లో సినిమా సన్నివేశాన్ని తలపించిన సీన్

నిజాయితీకి, నిబద్ధతకు నిలువుటద్దంగా నిలిచిన సివిల్ సర్వింట్స్‌కి ప్రజల నుండి ఎంతటి గౌరవం, ఆదరణ లభిస్తాయో ఓ తెలుగు ఐపీఎస్ అధికారిని చూస్తే అర్ధం అవుతుంది. బదిలీపై వెళ్తున్న ఆ అధికారికి ప్రజలు అపూర్వమైన వీడ్కోలు పలికారు.

Gujarat : బదిలీపై వెళ్తున్న తెలుగు ఎస్పీకి అపూర్వ వీడ్కోలు.. గుజరాత్‌లో సినిమా సన్నివేశాన్ని తలపించిన సీన్

Gujarat

Gujarat : పూలతో అలంకరించబడిన కారు.. ఆ కారు వెనుక అనేక కార్లు.. హీరో కారు దిగగానే జనం ఈలలు.. పూల జల్లులు ఇలాంటి సీన్స్ ఎక్కువగా సినిమాల్లో చూస్తుంటాం. కానీ రియల్‌గా జరిగితే.. అక్కడ హీరో.. ఇక్కడ ఐపీఎస్ అధికారి.. మిగతాదంతా సేమ్ టూ సేమ్. గుజరాత్‌లో బదిలీపై వెళ్తున్న ఓ తెలుగు ఐపీఎస్ అధికారికి అక్కడ ప్రజలు ఇచ్చిన అపూర్వమైన వీడ్కోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లా ఎస్పీగా పనిచేసి గాంధీనగర్‌కి బదిలీపై వెళ్తున్న వాసంశెట్టి రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన ఉద్యోగానికి న్యాయం చేస్తూ ఎప్పుడూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ వార్తల్లో ఉండే రవితేజ అంటే ఆ ప్రాంత ప్రజలకు ఎంతో గౌరవం, అభిమానం. తమ ప్రాంతం నుంచి వేరే చోటుకి రవితేజ బదిలీ అవుతున్న వేళ అక్కడి అధికారులు, ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో ఆయనకు వీడ్కోలు పలికారు.

Passengers Fell Ill In Special Train: గుజరాత్ వెళ్తున్న ప్రత్యేక రైలులో 90 మందికి ఫుడ్ పాయిజన్

పూలతో అలంకరించబడిన కారులో రవితేజను కూర్చోబెట్టారు. ఆ కారుకి రెండువైపుల తాడు కట్టారు. ఇరువైపులా నిలబడిన జనం ఆ కారును లాగుతున్నట్లు వీడియోలో మనకి కనిపిస్తుంది. కారు నుంచి దిగిన ఆయనపై పూల జల్లు కురిపించారు. మెడలో పూలదండలు వేసి గౌరవించారు. ఆయనకు వీడ్కోలు పలికేందుకు డిపార్ట్ మెంట్ మొత్తం తరలివచ్చింది. పాట్నా హైకోర్టులో అడ్వకేట్ గా పనిచేస్తున్న ఆదిత్య ఆనంద్ (Adv Aditya Anand) తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు.

‘ఇది ఏ సినిమాలోని సన్నివేశం కాదు కానీ ఇది వాస్తవమే. గుజరాత్ పోలీసు అధికారి వాసంశెట్టి రవితేజ , ఐ.పి.ఎస్. జునాగఢ్ నుంచి గాంధీనగర్‌కు బదిలీ అయ్యారు. అతను నిజాయితీ, విధేయత మరియు సున్నితమైన వ్యక్తిత్వం కలవాడిగా ప్రసిద్ధి చెందారు. ప్రజల నుంచి ఇంత ప్రేమ, గౌరవం ఉండటం గర్వించదగ్గ విషయం’ అనే శీర్షికతో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Gold Smuggling : దుబాయ్ నుండి రూ.50 లక్షల విలువైన బంగారం స్మగ్లింగ్.. గుజరాత్ వ్యక్తిని కిడ్నాప్ చేసి బంగారం, నగదు దోచుకెళ్లిన ఇద్దరు వ్యక్తులు

2015 బ్యాచ్‌కు చెందిన రవితేజ స్వస్థలం డా.బి.ఆర్ అబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలం పెదపట్నం లంక. 2019 లో జునాగఢ్ జిల్లా ఎస్పీగా తొలి పోస్టింగ్‌లో నియమించబడ్డ రవితేజ అక్కడ మూడేళ్లు సేవలు చేశారు. ప్రస్తుతం అక్కడి నుంచి బదిలీ మీద గాంధీనగర్ వెళ్తున్నారు. వాసంశెట్టి రవితేజపై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.