Anand Mahindra : భారీ వర్షంలో మనుష్యుల మధ్య ఆశ్రయం పొందిన జింకలు .. మనుసు దోచుకున్న ఆనంద్ మహీంద్రా వీడియో
ఆనంద్ మహీంద్రా షేర్ చేసే వీడియోలు అందరినీ ఆకట్టుకుంటాయి. తాజాగా భారీ వర్షంలో మనుష్యుల మధ్య సేద తీరుతున్న జింకల వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది.

Anand Mahindra
Anand Mahindra : కుండపోతగా వర్షం కురుస్తోంది. మనుషులతోపాటు కొన్ని జింకలు కూడా ఒకే చోట ఆశ్రయం పొందుతున్నాయి. ఈ దృశ్యం వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా మనసు దోచుకుంది. ట్విట్టర్‌లో ఆయన షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసే కొన్ని వీడియోలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. కొన్ని మానవ సంబంధాలను ఉద్దేశించి, కొన్ని విజ్ఞానం పంచేవి, కొన్ని కొందరి సృజనాత్మకత బయటపెట్టేవి.. ఇలా పోస్ట్ చేస్టుంటారు. తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ నుంచి (anand mahindra) ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో భారీవర్షంలో ఒకేచోట మనుష్యులు, జింకలు ఆశ్రయం పొందుతున్నట్లుగా కనిపిస్తుంది. మనుష్యులు, జంతువుల మధ్య ఉన్న గొప్ప అనుబంధాన్ని సూచిస్తున్న ఈ వీడియో వైరల్ అవుతోంది.
‘జపాన్ లోని నారాలోని ఇల్డ్ సికా జింక.. భారీ వర్షం, పిడుగులు పడుతుంటే అవి ఎంతగానో నమ్మే మనుష్యుల దగ్గర ఆశ్రయం పొందుతున్నాయి. ఈ వీడియోను సేవ్ చేసుకుని ప్రపంచం ఎలా ఉండాలో నాకు నేను గుర్తు చేసుకోవాలనుకున్నప్పుడల్లా వీక్షిస్తాను’ అనే క్యాప్షన్‌తో ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
Wild sika deer in Nara, Japan, taking shelter with humans they trust during a thunderstorm. I’m going to store this video & view it whenever I want to remind myself how the world SHOULD be… #WorldNatureConservationDay pic.twitter.com/wYKalbMUAC
— anand mahindra (@anandmahindra) July 28, 2023