Jallikattu Tragedy: తమిళనాడు జల్లికట్టులో మరో విషాదం..
తమిళనాడు జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. ధర్మపురిలో నిర్వహించిన జల్లికట్టును వీక్షించేందుకు వచ్చిన గోకుల్ అనే 14ఏళ్ల బాలుడు మృతిచెందాడు.

Jallikattu
Jallikattu Tragedy: తమిళనాడు జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. ధర్మపురిలో నిర్వహించిన జల్లికట్టును వీక్షించేందుకు వచ్చిన గోకుల్ అనే 14ఏళ్ల బాలుడు మృతిచెందాడు. బంధువులతో కలిసి జల్లికట్టును చూసేందుకు బాలుడు వచ్చాడు. అయితే, బాలుడిని ఎద్దు కడుపులో పొడవడంతో తీవ్రగాయాలయ్యాయి. సమీపంలోని ఆస్పత్రిని అతన్ని తరలించినప్పటికీ ఉపయోగంలేకుండాపోయింది. అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.
బాలుడి వద్దకు ఎద్దు ఎలావచ్చిందనే దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ఇందుకోసం జల్లికట్టు సీసీ టీవీ పుటేజీని స్వాధీనం చేసుకున్నారు. పొంగల్ పండుగ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టును నిర్వహిస్తారు. కాగా జల్లికట్టులో ఇప్పటి వరకు అరవింద్ రాజ్, శికుమార్, కలైముట్టి గణేశన్ సహా ఇద్దరు ప్రేక్షకులు కూడా ఎద్దులు దాడిచేయడంతో చనిపోయారు.
తాజాగా గోకుల్ అనే బాలుడు మరణంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. అయితే ఈ ఈవెంట్ లో తొమ్మిది మంది ఎండ్లను నిలువరించి విజేతలుగా నిలిచారు. ఇదిలాఉంటే జల్లికట్టు ఆటను చూసేందుకు వచ్చిన వారితో పాటు ఆడివారితోసహా ఇప్పటికే పదుల సంఖ్యలో గాయపడ్డారు.