Arif meets Crane : ఫైనల్లీ క్రేన్‌ని కలిసిన ఆరీఫ్.. వీరి స్నేహం చూసి ముచ్చటపడుతున్న నెటిజన్స్
మనం ఎంతగానో ఇష్టపడే పక్షలు, జంతువులు మనకి దూరం అయితే ఆ బాధ మాటల్లో చెప్పలేం. ఓ క్రేన్ పక్షికి ఆరీఫ్ అనే యువకుడికి మధ్య స్నేహం అనుకోకుండా విడిపోయింది. అయితే ఆరీఫ్ కు ఆ పక్షిని కలిసే అవకాశం వచ్చింది. అప్పుడు వారిద్దరి రియాక్షన్ ఏంటో? చూసిన వారి మనసు చలించిపోతుంది.

Arif meets Crane
Arif meets Crane : జంతువులు, పక్షులతో పెనవేసుకున్న అనుబంధం అంత త్వరగా మర్చిపోవడం సాధ్యం కాదు. ఎంతో ఇష్టంగా వాటిని సాకిన మనుష్యులు అనూహ్యంగా వాటికి దూరం కావాల్సి వస్తే ఆ బాధను తట్టుకోలేరు. కొద్దిరోజుల క్రితం అరుదైన పక్షి సారస్ క్రేన్‌ను (sarus crane) ఆరీఫ్ (Arif) అనే యువకుడి నుంచి అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఓసారి దానిని చూడటానికి అధికారులు ఆరీఫ్ కి అవకాశం ఇవ్వడం అందరిలోనూ సంతోషం కలిగిస్తోంది.
intelligent dog : ఆ శునకం మహా ముదురు .. చదివింది చేసి చూపిస్తున్న డాగ్ వీడియో వైరల్
ఓ సంవత్సరం క్రితం గాయంతో ఉన్న క్రేన్‌ను ఆరీఫ్ తన పొలంలో గుర్తించాడు. దానిని తన సంరక్షణలో ఉంచి కాపాడాడు. దానికి ఆహారం ఇస్తూ కనిపించిన ఆరీఫ్ వీడియో కొద్దిరోజుల క్రితం వైరల్ గా మారింది. ఈ వార్త ఉత్తరప్రదేశ్ ((Uttar Pradesh)) అటవీ అధికారుల వరకూ వెళ్లింది. అతడు దానిని తన వద్ద ఉంచుకోవడం చట్టవిరుద్ధమని ఆరీఫ్ ఇంటికి వెళ్లి క్రేన్ ను స్వాధీనం చేసుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆరీఫ్ క్రేను వారికి అప్పగించాడు. అలా వారిద్దరి మధ్య అనుబంధానికి బ్రేక్ పడింది.
Viral Video : వీడెవడండీ బాబూ.. మెట్రోలో దుస్తులు విప్పి ఏకంగా స్నానమే చేశాడు, వీడియో వైరల్
ఈ ఘటన జరిగిన మూడు వారాల తర్వాత ఆరీఫ్ కు క్రేన్ ను కలిసే అవకాశం కల్పించారు అధికారులు. కాన్పూర్ జూలో (Kanpur Zoo) సురక్షితంగా ఉన్న క్రేన్ ను ఆరీఫ్ కలవడం నెటిజన్లను సంతోష పెడుతోంది. ఆరీఫ్ ను చూడగానే క్రేన్ స్పందించిన తీరు చూసేవారి హృదయాలను కదిలించింది. వీరిద్దరూ కలిసిన వీడియోను కైలాష్ నాథ్ యాదవ్ (Kailash Nath Yadav) అనే వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆరీఫ్ ను చూడగానే క్రేన్ రెక్కలు విప్పుతూ స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. వారిద్దరి మధ్య బంధాన్ని చూసి నెటిజన్లు ముచ్చట పడుతున్నారు. ఏది ఏమైనా ఆరీఫ్, క్రేన్ ల స్నేహబంధం ఇంకా వైరల్ అవుతూనే ఉంది.
आज फिर एक बार फिर बेजुबान सारस अपने जीवन दाता मित्र आरिफ को देख तड़प उठा चहक उठा लेकिन दोनों मजबूर थे एक दूसरे को छु न सके pic.twitter.com/rzhJgZxpSJ
— कैलाश नाथ यादव (@kailashnathsp) April 11, 2023