Jammu Kashmir: ఘోర ప్రమాదం.. 10 మంది సైనికులు మృతి.. 200 అడుగుల లోయలో

మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Jammu Kashmir: ఘోర ప్రమాదం.. 10 మంది సైనికులు మృతి.. 200 అడుగుల లోయలో

Army Vehicle Representative Image (Image Credit To Original Source)

Updated On : January 22, 2026 / 5:30 PM IST

Jammu Kashmir: జమ్ముకశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. దోడా జిల్లాలో అదుపు తప్పిన ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది సైనికులు మృతి చెందారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆర్మీ వాహనం 200 అడుగల లోయలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆర్మీ వెహికల్ నుజ్జు నుజ్జు అయిపోయింది.

సిబ్బందితో బుల్లెట్ ప్రూఫ్ ఆర్మీ వాహనం ఎత్తైన పోస్ట్ వైపు వెళుతుండగా.. డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం 200 అడుగుల లోతైన లోయలోకి పడిపోయిందని ఉన్నతాధికారులు తెలిపారు.

సమాచారం అందిన వెంటనే సైన్యం, పోలీసులు రంగంలోకి దిగారు. సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక చికిత్స కోసం ఉధంపూర్ సైనిక ఆసుపత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించారు. ఇటీవల గుల్మార్గ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖకు సమీపంలో ఇద్దరు ఆర్మీ పోర్టర్లు జారిపడి మరణించారు. అది జరిగిన కొన్ని రోజులకే ఈ ఘోర ప్రమాదం జరిగింది.

గుల్మార్గ్ సెక్టార్‌లోని అనితా పోస్ట్‌కు వెళ్తున్న పోర్టర్లు జనవరి 8న లోతైన లోయలో పడిపోయారు. తప్పిపోయిన పోర్టర్ల కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. రెండు రోజుల తర్వాత వారి మృతదేహాలను వెలికితీశారు.

Also Read: ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 10మంది మావోయిస్టులు మృతి.. మృతుల్లో కీలక నేతలు..