Jharkhand Encounter : ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 10మంది మావోయిస్టులు మృతి.. మృతుల్లో కీలక నేతలు..

ఝార్ఖండ్‌లోని చైబాసా అడవుల్లో సీఆర్పీఎఫ్ కోబ్రా జవాన్లు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పెద్దెత్తున మావోయిస్టులు ప్రాణాలుకోల్పోయారు.

Jharkhand Encounter : ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 10మంది మావోయిస్టులు మృతి.. మృతుల్లో కీలక నేతలు..

Massive encounter

Updated On : January 22, 2026 / 12:13 PM IST

Jharkhand Encounter : ఝార్ఖండ్ రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 10మందికిపైగా మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో కొంతమంది మావోస్టు కీలక నేతలు కూడా ఉన్నట్లు సమాచారం.

 

ఝార్ఖండ్‌లోని చైబాసా అడవుల్లో సీఆర్పీఎఫ్ కోబ్రా జవాన్లు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పెద్దెత్తున మావోయిస్టులు ప్రాణాలుకోల్పోయినట్లు సమాచారం. ఇప్పటి వరకు 10మంది మరణించారని సమాచారం అందుతుండగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. కోబ్రా బెటాలియన్‌ 209తో ఈ ఆపరేషన్‌ చేపట్టారు.