జైలు నుంచే పాలన అంటున్న ఢిల్లీ సీఎం.. ఆయన రాజీనామా తప్పదంటున్న బీజేపీ

రాష్ట్ర సీఎంను రెండు కారణాలతో తొలగించొచ్చు. ఒకటి అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయినప్పుడు. రెండు..

జైలు నుంచే పాలన అంటున్న ఢిల్లీ సీఎం.. ఆయన రాజీనామా తప్పదంటున్న బీజేపీ

దేశంలో అప్పుడుప్పుడు కొన్ని ప్రత్యేక సిచ్యువేషన్స్ వస్తుంటాయి. అందులో సీఎం కేజ్రీవాల్ ఇష్యూ ఒకటి. పదవిలో ఉండి అరెస్ట్ అయిన తొలి సీఎం ఆయనే కావడం.. పైగా జైలు నుంచే పాలన చేస్తానని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. దేశంలో ఇప్పటివరకు ఈ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ రాలేదు. దీంతో కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతారా..? జైలు నుంచి పాలన సాధ్యమేనా.. అందుకు ఉన్న అడ్డంకులు ఏంటన్న దానిపై చర్చ జరుగుతోంది. కేజ్రీవాల్‌ జైలు నుంచే పాలన చేస్తారని ఆప్..లేదు సీఎం పదవికి రిజైన్ చేయాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేస్తుంది.

జైలు నుంచి కేజ్రీవాల్ బాధ్యతలను నిర్వహించేందుకు న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని ఢిల్లీ హైకోర్టు కూడా తేల్చేసింది. ఆచరణాత్మక ఇబ్బందులు ఉండొచ్చు కానీ.. జైలు నుంచి పాలన కొనసాగించడానికి చట్టపరంగా అడ్డంకులేమి లేవని కోర్టు స్పష్టం చేసింది.

కేజ్రీవాల్‌పై ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఓ నిందితుడిగా మాత్రమే జైలుకు వెళ్లారు. దోషిగా తేలితే మాత్రం సీఎం పదవికి అనర్హుడు అవుతారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అప్పుడు సీఎం పదవి నుంచి ఆయన తప్పుకోవడం కానీ తప్పించడం కానీ ఉంటుంది. ఇప్పుడు ఆయన అండర్ ట్రయల్ ఖైదీగానే జైలులో ఉంటున్నారు.

అంతకంటే ఎక్కువ శిక్షపడాలి
ఎమ్మెల్యే పదవికి అనర్హుడు కావాలంటే కూడా రెండేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్షపడాలి. దీంతో జైలు నుంచి పాలన చేయడానికి కానీ, ఆయన పదవికి కానీ ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందులేమి లేవంటున్నారు లీగల్ ఎక్స్ పర్ట్స్‌.

జైలు నుంచి పాలన టెక్నికల్‌గా ఎంతవరకు సాధ్యమనేదే ఇప్పుడు జరుగుతోన్న చర్చ. సీఎం అంటే రోజు బోలెడు కార్యక్రమాలు ఉంటాయి. అధికారులతో రివ్యూలు, కేబినెట్ సమీక్షలు, ట్రాన్స్‌ ఫర్లు, అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రణాళికలు ఇలా ఎన్నో పనులు ఉంటాయి. వీటన్నింటిని జైలు నుంచి నిర్వహించడం సాధ్యమా అనేదే పెద్దప్రశ్న.

లాజికల్‌గా సాధ్యమా?
అయితే జైలు నుంచి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, నిర్ణయాలు తీసుకుని మంత్రివర్గంతో అమలు చేయించడం వరకు ఓకే. బట్ పూర్తిస్థాయిలో జైలు నుంచి సీఎం బాధ్యతలను నడిపంచడం లాజికల్‌గా సాధ్యం కాదు. కేబినెట్ భేటీలు, అధికారులతో రివ్యూలు చేయడానికి వీలుకాదు. జైలులో సీఎం కేజ్రీవాల్ యాక్టివిటీ పెరిగితే జైలులో మిగతా ఖైదీలకు అసౌర్యం కలిగే అవకాశం ఉంటుంది.

ఫోన్లు, ల్యాప్‌ టాప్‌లు వాడటానికి రూల్స్ ఒప్పుకోవు. అధికారులు, మంత్రులు రెగ్యులర్‌గా జైలుకు వెళ్లి..సీఎంతో భేటీ అవడానికి నిబంధనలు అడ్డువస్తాయి. ఒకవేళ కోర్టు పర్మిషన్‌తో సమావేశాలు నిర్వహించినా..విచారణ విషయంపై ఈడీ అభ్యంతరం తెలిపే అవకాశం ఉంటుంది. జైలులో కేబినెట్ సమావేశాలు నిర్వహించడం కూడా కష్టమే. వసతులు ఉండవు. పైగా మంత్రివర్గమంతా జైలుకు వెళ్లి మీటింగ్‌కు అటెండ్ కావాలంటే పెద్దతతంగం ఉంటుంది. కోర్టు అనుమతులు, భద్రత వంటి సమస్యలు ఉంటాయి.

జైలు నుంచి బాధ్యతలను నిర్వహించడానికి అడ్డంకులు లేవంటూనే.. మరో విషయాన్ని స్పష్టం చేసింది ఢిల్లీ హైకోర్టు. సీఎంను తొలగించే అంశం కేంద్రం పరిధిలోనిదని కూడా చెప్పింది. దాంతో ఇప్పుడు కేంద్రప్రభుత్వం ఏం చేయబోతుందనేది కూడా ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఢిల్లీ పరిణామాలపై కేంద్ర హోంశాఖ ఏదో స్టెప్ తీసుకోబోతుందన్న ప్రచారం జరుగుతోంది. కేజ్రీవాల్ రాజీనామా చేయకపోతే అతడ్ని పదవి నుంచి తొలగించడం లేకపోతే ఢిల్లీ ప్రభుత్వాన్ని రద్దు చేయడం వంటి రెండు ఆప్షన్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక రాష్ట్ర సీఎంను రెండు కారణాలతో తొలగించొచ్చు. ఒకటి అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయినప్పుడు. రెండు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు సీఎం పదవిని కోల్పోతారు. అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టినా కేజ్రీవాల్ నెగ్గేందుకు పూర్తి మెజార్టీ ఉంది. అయితే రాష్ట్రపతి పాలన విధిస్తారన్న చర్చ కూడా జరుగుతోంది.

Narasapuram Lok Sabha Segment : ఉమాబాల వర్సెస్ వర్మ.. నరసాపురంలో ఎవరి సత్తా ఎంత?