పేద దేశాల వ్యాక్సిన్.. 90శాతం ప్రభావంతో.. కంపెనీ కీలక ప్రకటన

  • Published By: vamsi ,Published On : November 23, 2020 / 04:54 PM IST
పేద దేశాల వ్యాక్సిన్.. 90శాతం ప్రభావంతో.. కంపెనీ కీలక ప్రకటన

Updated On : November 23, 2020 / 5:18 PM IST

ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలు టీకాలు విడుదల చేసే పరిస్థితిలోకి వచ్చేశాయి. వచ్చే ఏడాది ప్రారంభ నెలల్లో(జనవరి, ఫిబ్రవరిల్లో) కరోనా వైరస్ మహమ్మారికి సమర్థవంతమైన వ్యాక్సిన్ వచ్చే అవకాశం బలంగా మారుతోంది. వివిధ కంపెనీలు కరోనా వ్యాక్సిన్‌‌లను డెవలప్‌‌ చేస్తుండగా.. ఆస్ట్రాజెనికా-ఆక్స్‌‌ఫర్డ్‌‌ యూనివర్శిటీలు డెవలప్‌‌ చేసిన వ్యాక్సిన్‌‌ కోసం మాత్రం భారత్‌తో సహా.. పేద అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి.



ఈ వ్యాక్సిన్‌‌ కోసం వచ్చిన ఆర్డర్లలో మిడిల్‌‌ క్లాస్ దేశాలే ఎక్కువగా ఉన్నట్లు రీసెర్చ్‌‌ కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్‌‌ సప్లయ్‌‌ కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎక్కువగా ఆస్ట్రాజెనికాతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆస్ట్రాజెనికా కంపెనీ కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రాజెనికా-ఆక్స్‌‌ఫర్డ్‌‌ వ్యాక్సిన్‌‌ కరోనా వ్యాక్సిన్ 70శాతం ప్రభావవంతంగా ఉందని తన ప్రకటనలో తెలిపింది. అదే సమయంలో, కరోనా వైరస్ సంక్రమణను నివారించడంలో ఈ టీకా 90శాతం ప్రభావవంతంగా ఉందని, ఈ మేరకు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు కంపెనీ స్పష్టం చేసింది.



https://10tv.in/delhi-ayurveda-doctors-can-now-perform-surgeries/
ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే ఆస్ట్రాజెనెకా సంస్థ ప్రకటన ప్రకారం.. కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో ఈ రోజు మనం ఒక ముఖ్యమైన దశకు చేరుకున్నామని వెల్లడించింది. ఆస్ట్రాజెనికా-ఆక్స్‌‌ఫర్డ్‌‌ వ్యాక్సిన్‌‌ 70.4 శాతం ప్రభావవంతంగా ఉందని, అదే సమయంలో, రెండు డోస్‌లు అందిస్తే.. 90 శాతం ప్రభావవంతంగా ఉన్నట్లుగా కంపెనీ ప్రకటించింది. ఆస్ట్రాజెనికా భాగస్వామ్యంతో వచ్చే ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్ మోతాదులను అందుబాటులోకి తీసుకురావాలని ఆశిస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్ ఇప్పటికే ప్రకటించింది.



ఇప్పటికే ఫైజర్‌‌, మోడర్నా వంటి కంపెనీలు డెవలప్‌‌ చేసిన వ్యాక్సిన్‌‌ చివరి దశలలో ఉన్నాయి. ఈ వ్యాక్సిన్‌‌లు అందుబాటులోకి వచ్చినా తక్కువ ధరకు లభించే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌లపైనే అందరి దృష్టి ఉంది. ఫైజర్‌‌‌‌ డెవలప్‌‌ చేసిన వ్యాక్సిన్‌‌ డోస్‌‌ ధర సుమారుగా రూ. 1,446 వద్ద అందుబాటులోకి రానుంది. ఈ ధరతో పోల్చుకుంటే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌‌ ధర చాలా తక్కువ. డోస్‌‌ ధర సుమారు రూ. 290వరకు మాత్రమే ఉంటుంది. ఫైజర్‌‌‌‌ వ్యాక్సిన్‌‌ ధరలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌‌ ధర మూడో వంతు మాత్రమే. ఎయిర్‌‌‌‌ఫైనిటీ లెక్కల ప్రకారం ఒక్క ఆస్ట్రాజెనికా-ఆక్స్‌‌పర్డ్‌‌ నుంచి 320 కోట్ల డోస్‌‌లను 50 పైగా మిడిల్‌‌ క్లాస్ దేశాలకు సరఫరా కానుంది. మోడర్నా వ్యాక్సిన్‌‌ డోస్ ధర కూడా రూ. 1,850 నుంచి రూ.2,738 మధ్యలో ఉండనుంది.