Noida Twin Towers Demolished : నేల మట్టమైన నోయిడా ట్విన్ టవర్స్..3,700 కిలోల పేలుడు పదార్థాలతో కూల్చివేసిన అధికారులు

నోయిడాలోని దేశంలోనే అతి పెద్ద ట్విన్ టవర్స్ నేల మట్టమయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా 2.30 గంటలకు కూల్చివేశారు. 12-15 సెకన్ల వ్యవధిలో ట్విన్ టవర్స్ మొత్తం నేల మట్టమైంది. 3,700 కిలోల పేలుడు పదార్థాలతో ట్విన్ టవర్స్ ను కూల్చివేశారు.

Noida Twin Towers Demolished : నేల మట్టమైన నోయిడా ట్విన్ టవర్స్..3,700 కిలోల పేలుడు పదార్థాలతో కూల్చివేసిన అధికారులు

Noida Twin Towers Demolished

Updated On : August 28, 2022 / 3:16 PM IST

Noida Twin Towers Demolished : నోయిడాలోని దేశంలోనే అతి పెద్ద ట్విన్ టవర్స్ నేల మట్టమయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా 2.30 గంటలకు కూల్చివేశారు. 12-15 సెకన్ల వ్యవధిలో ట్విన్ టవర్స్ మొత్తం నేల మట్టమైంది. 3,700 కిలోల పేలుడు పదార్థాలతో ట్విన్ టవర్స్ ను కూల్చివేశారు. మధ్యాహ్నం 2.29 నిమిషాలకు సైరన్ మోగింది. ట్విన్ టవర్స్ కింద నుంచి పైకి ఒక్కో బ్లాక్స్ కు మధ్య 17 మిల్లీ సెకన్ల సమయం పట్టింది.

9 సెకన్ల వ్యవధిలో ట్విన్ టవర్స్ మొత్తం నేల మట్టమైంది. గాల్లోకి వెలువడే దుమ్ము, ధూళి పోవడానికి మరో 12 సెకన్లు పడుతుంది. కూల్చివేత సమయంలో 30 కిలో మీటర్ల పరిధిలో భూ ప్రకపంనలు సంబంధించే అవకాశం ఉంది. సమీప ప్రాంతాలను అధికారులు పూర్తిగా ఖాళీ చేయించారు. నోయిదా ఎక్స్ ప్రెస్ వేను అధికారులు మూసివేశారు.

Noida Twin Towers Demolition : కూల్చివేత తర్వాత నోయిడా ట్విన్ టవర్స్ వద్ద దృశ్యాలు

ట్విన్ టవర్ పరిసర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. 550 మంది పోలీసులు, 100 మంది రిజర్వ్ బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. 4 క్విక్ రెస్పాన్స్ టీమ్ లు,ఎన్ డీఆర్ఎఫ్ టీమ్స్ ఏర్పాటు చేశారు.

అపెక్స్ టవర్ లో 11 ప్రైమరీ బ్లాస్ట్ ఫ్లోర్స్ ఉండగా, సియాన్ టవర్ లో 10 ప్రైమరీ బ్లాస్ట్ ఫ్లోర్స్ ఉన్నాయి. బేస్ మెంట్ 1ను డిమాలిషన్ టీమ్ ముందుగా పేల్చివేసింది. మొత్తం 9 సెకన్లలో పేలుడు పదార్ధాలు పేలేలా ఏర్పాట్లు చేశారు.