Family Drown In Saryu River : స్నానానికి వెళ్లి..నదిలో ముగినిపోయిన ఒకే కుటుంబానికి చెందిన 12మంది

స్నానం చేసేందుకు నదిలోకి వెళ్లి ఒకే కుటంబానికి చెందిన 12 మంది మునిగిపోయిన ఘటన శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగింది.

Family Drown In Saryu River : స్నానానికి వెళ్లి..నదిలో ముగినిపోయిన ఒకే కుటుంబానికి చెందిన 12మంది

Ayodhya

Updated On : July 9, 2021 / 6:43 PM IST

Family Drown In Saryu River స్నానం చేసేందుకు నదిలోకి వెళ్లి ఒకే కుటంబానికి చెందిన 12 మంది మునిగిపోయిన ఘటన శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగింది. ఆగ్రా నుంచి అయోధ్య సందర్శనకు వచ్చిన ఓ కుటుంబం..స్నానం చేయడానికి సరయూ నది, గుప్తర్ ఘాట్‌ వద్దకు వెళ్లింది. కుటుంబంలోని కొందరు కాళ్లు కడుక్కోగా.. మరికొందరు స్నానం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా నీటి ప్రవాహ వేగం పెరగడంతో వారు కొట్టుకుపోయారు. దీన్ని గమనించిన మిగిలిన కుటుంబీకులు వారికి సాయం చేసేందుకు యత్నించగా.. వారూ నీట మునిగారు. ముగినిపోయిన వారిలో మహిళలు,చిన్నారులు కూడా ఉన్నారు.

ఇప్పటి వరకు ఆరుగురిని రక్షించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మిగతా వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్‌ అనుజ్‌కుమార్‌ తెలిపారు. గజ ఈతగాళ్లతో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రక్షించిన ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.