అయోధ్యలో గంట మోగిస్తే..కిలోమీటరు వరకూ ‘‘ఓం కారం’’ వినిపిస్తుంది

ayodhya sri ram mandir :అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో అన్నీ అద్భుతాలే. భక్తుల ఆశలకు..ఆకాంక్షలను అనుగుణంగా రామమందిర నిర్మాణం రూపుదిద్దుకుంటోంది. ఈ నిర్మాణంలో భక్తులు హృదయపూర్వకంగా పాలుపంచుకుంటున్నారు. దీంట్లో భాగంగా రామమందిరానికి ఓ భారీ కంచు గంట వచ్చి చేరింది.
రామేశ్వరానికి చెందిన భక్తురాలు..లీగల్ రైట్స్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి మండా రాజ్యలక్ష్మి ఈ కంచు గంటను తయారు చేయించి రామమందినాకి సమర్పించారు. 613 కిలోల బరువు ఉన్న ఈ గంట సాధారణమైన గంట కాదు. ఓ అరుదైన ప్రత్యేకత కూడా ఉంది. మామూలుగా గంట కొడితే ఠంగుమని వినిపిస్తుంది.
కానీ ఈ గంట కొడితే దీన్ని ఒక్కసారి మోగిస్తే కిలోమీటర్ వరకు ‘ఓం’ అనే శబ్ధం వస్తోంది. దీంతో భక్తులు ఎంతో ఆసక్తిగా దాన్ని మోగిస్తూ.. భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. గంట కొట్టి తాము కూడా ‘‘ఓం కారాన్ని’’పఠిస్తున్నారు.
ఈ అరుదైన గంటకు ప్రత్యేక పూజలు చేసి సెప్టెంబరు 17న ప్రత్యేక వాహనంలో బయలుదేరిన ఈ గంట బుధవారం (అక్టోబర్ 7,2020) అయోధ్యకు చేరుకుంది. 4.13 అడుగుల పొడవు, 3.9 అడుగుల వెడల్పుతో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, వినాయకుడి ప్రతిమలను ఏర్పాటు చేశారు. జై శ్రీరాం అనే అక్షరాలు కూడా చెక్కించారు.
ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ..ఈ అరుదైన కంచు గంట తయారు చేసి ఇవ్వడం సంతోషంగా ఉందని..రామాయణంలో రామేశ్వరానికి ప్రత్యేక స్థానం ఉంది. సీతాదేవి కోసం రాముడు రామేశ్వరానికి వచ్చి శ్రీలంకకు వానరసేనతో కలిసి శ్రీరాముడు సముద్రంలో వారధిని నిర్మించారు. అందుకే ఇక్కడి నుంచి భారీ గంటను తయారు చేయంచి శ్రీరాముల వారికి సమర్పించామని తెలిపారు. ఈ అవకాశం నాకు దక్కటం అదృష్టంగా భావిస్తున్నాననీ..శ్రీరాముడి మందిర ఏర్పాటులో తాను కూడా ఓ ఉడుతనని భక్తి పారవశ్యంతో తెలిపారు.