అయోధ్య కేసులో ఏకగ్రీవ తీర్పు: షియా బోర్డు పిటిషన్ కొట్టివేత

  • Published By: vamsi ,Published On : November 9, 2019 / 05:18 AM IST
అయోధ్య కేసులో ఏకగ్రీవ తీర్పు: షియా బోర్డు పిటిషన్ కొట్టివేత

Updated On : November 9, 2019 / 5:18 AM IST

దేశవ్యాప్తంగా ఉత్కంఠ క్రియేట్ చేసిన అయోధ్య కేసులో ఎట్టకేలకు చరిత్రాత్మక తీర్పు ఇస్తుంది సుప్రీం కోర్టు. అక్టోబర్ 16న తీర్పును రిజర్వులో పెట్టిన కోర్టు.. శాంతి భద్రతలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తర్వాత ఇవాళ(09 నవంబర్ 2019) వెల్లడిస్తుంది. జస్టిస్ గోగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే కోర్టు నెంబరు 1 హాలులో రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులు సమావేశం అవగా.. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్రా, రాజీవ్ ధావన్‌లు హాజరయ్యారు. ఒకటో నెంబరు హాల్‌కు చేరుకున్న న్యాయమూర్తులు.. జడ్జ్‌మెంట్ కాపీలున్న సీల్డ్ కవర్లను తెరిచి తీర్పును చదువుతున్నారు.

అయోధ్య వివాదంపై షియా వక్ఫ్ బోర్డు వేసిన పిటిషన్‌ను ఏకాభిప్రాయంతో కొట్టివేసినట్లు వెల్లడించారు. వివాదాస్పద భూమి తమదేనంటూ షియా బోర్డు వేసిన పిటిషన్ అనర్హమైందంటూ కొట్టివేసింది కోర్టు.

చరిత్ర, న్యాయ, మతపరమైన అంశాలకు లోబడే తీర్పు. మతపరమైన విషయాల్లో కోర్టు జోక్యం చేసుకోదని, బాబ్రీ మసీదును ఎప్పుడు నిర్మించారో సరైన ప్రాతిపదిక లేదని జస్టిస్ గొగొయ్ చెప్పారు. బాబరు కాలంలోనే మసీదు నిర్మించారని, మత గ్రంథాల ఆధారంగా తీర్పు ఇవ్వలేమని వ్యాఖ్యానించారు.