Bank Holidays : జులైలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసా?

జులై 2న ఆదివారం కావడంతో ఆ రోజు దేశంలోని అన్ని బ్యాంకుల సెలవు. ఇక జులై 5న...

Bank Holidays : జులైలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసా?

Bank Holidays

Updated On : June 24, 2023 / 4:42 PM IST

Bank Holidays – July 2023: భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) జులై నెలకు సంబంధించి దేశంలో బ్యాంకుల సెలవుల తేదీలను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా బ్యాంకులకు ఉండే సాధారణ సెలవులతో పాటు ఏయే రాష్ట్రాల్లో ఏయే రోజుల్లో బ్యాంకులకు ప్రత్యేక సెలవులు ఉన్నాయో చూద్దాం. అన్ని రాష్ట్రాల్లో ఉన్న సెలవులతో కలిపి మొత్తం 15 సెలవులు ఉన్నాయి.

జులై 2న ఆదివారం కావడంతో ఆ రోజు దేశంలోని అన్ని బ్యాంకుల సెలవు. జులై 5న గురు హర్‌ గోవింద్ సింగ్ జయంతి ఉంది. దీంతో జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. జులై 6న మిజో మెయిచ్ఛె ఇన్సుయిహ్ఖామ్ పావ్ల్ డే కారణంగా మిజోరంలో బ్యాంకులకు సెలవు.

జులై 8న రెండో శనివారం. జులై 9 ఆదివారం సెలవు. జులై 11న కెర్ పూజ కారణంగా త్రిపురలో సెలవు ఉంటుంది. జులై 13న భాను జయంతి కారణంగా సిక్కింలో బ్యాంకులకు సెలవు. జులై 16న ఆదివారం సెలవు. జులై 17 న యూ తిరోట్ సింగ్ డే ఉండడంతో మేఘాలయాలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

జులై 22న నాలుగో శనివారం కారణంగా సెలవు. జులై 23న ఆదివారం. జులై 29న మొహర్రం కారణంగా సెలవు ఉంటుంది. జులై 30న ఆదివారం సెలవు. జులై 31న మార్టిర్డం డే కారణంగా హరియాణాతో పాటు పంజాబ్‌లో బ్యాంకులకు సెలవు.

Guinness World Records : 15 గంటలు.. 286 స్టేషన్లు.. ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి వరల్డ్ రికార్డ్ సాధించిన శశాంక్ మను