మన్మోహన్,రాజన్ హయాంలో…బ్యాంకుల పరిస్థితి దారుణంగా ఉంది

మజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్,మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ కాలంలోనే ప్రభుత్వరంగ బ్యాంకుల పరిస్థితి దిగజారిపోయిందని ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు.మోడీ సర్కార్ తొలి ఐదేళ్లలో ఆర్థికవృద్ధికి చెపట్టాల్సిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని రఘురాంరాజన్ ఇటీవల చేసిన వ్యాఖ్యల్ని ఆమె ఖండించారు.
మంగళవారం(అక్టోబర్-15,2019)కొలంబియా యూనివర్శిటీలో ఆమె మాట్లాడుతూ…రాజన్ తను చెప్పే ప్రతి పదానికి ఫీల్ అవుతున్నాడని సందేహపడటానికి నా దగ్గర కారణం లేదు. అతనికి తగిన గౌరవం ఇస్తున్నాను, కానీ వాస్తవాలనుమీ ముందు ఉంచుతున్నాను. ప్రధానమంత్రిగా మన్మోహన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) గవర్నర్‌గా రఘురాం రాజన్ కాంబినేషన్ ఉన్న సమయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులుకు చెత్త దశ లేదని మీ ముందు ఉంచారు. ఆ సమయంలో మనలో ఎవరికీ దీని గురించి తెలియదు.
2011-2012లో ప్రభుత్వరంగ బ్యాంకుల బ్యాడ్ లోన్స్ రూ. 9,190 కోట్ల నుంచి 2013-2014లో రూ. 2.16 లక్షల కోట్లు పెరిగినట్లు ఆర్బీఐ తెలిపింది. 2014 మేలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిందని ఆమె అన్నారు. రాజన్ హయాంలో విపరీతంగా రుణాలు మంజూరు అయ్యాయన్నారు. కొంతమంది వ్యక్తుల ప్రోద్బలంతో కేవలం ఫోన్ కాల్స్ ఆధారంగా అప్పులు ఇచ్చేశారని నిర్మలా ఆరోపించారు. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయి నిధుల కోసం ప్రభుత్వం వైపు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. వాళ్లు సృష్టించిన సమస్యల్ని పరిష్కరిస్తూ బ్యాంకింగ్ వ్యవస్థకు జీవం పోసే ప్రయత్నం చేస్తున్నామనట్లు ఆర్థికమంత్రి తెలిపారు.