యూపీలో వలస కూలీలపై కెమికల్ స్ర్పే.. ఆరోపణలపై బరేలీ జిల్లా మేజిస్ట్రేట్ విచారణ

  • Published By: sreehari ,Published On : March 30, 2020 / 10:03 AM IST
యూపీలో వలస కూలీలపై కెమికల్ స్ర్పే.. ఆరోపణలపై బరేలీ జిల్లా మేజిస్ట్రేట్ విచారణ

Updated On : March 30, 2020 / 10:03 AM IST

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించింది. 21 రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగనుంది. ఈ పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు నగరంలోకి తిరిగి వచ్చారు. నగరంలోకి ప్రవేశించిన వలస కార్మికులపై కెమికల్ వాటర్ తో స్ప్రే చేయడంపై అధికార యంత్రాంగంపై  ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన బరేలీ జిల్లా మేజిస్ట్రేట్ నితీష్ కుమార్ ఈ ఆరోపణలను పరిశీలిస్తామని సోమవారం చెప్పారు. 

బస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో, ట్విట్టర్లో వైరల్ అవుతుంది. సోషల్ మీడియా యూజర్లంతా కార్మికుల పట్ల అనుచితంగా ప్రవర్తించడాన్ని తప్పుబట్టారు. రోడ్లుకు పక్కన కార్మికులను కూర్చొబెట్టి వారిపై రసాయనం కలిపిన నీటితో పిచికారీ చేయడాన్ని కొందరు నెటిజన్లు ఆరోపించారు. 

నీటిని సోడియం హైపోక్లోరైట్ (లిక్విడ్ బ్లీచ్)తో కలుపుతారు” అని పేరు చెప్పేందుకు ఇష్టపడని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. అధికారుల సూచనల మేరకు ఈ చర్యలు తీసుకున్నామని ఓ అధికారి తెలిపారు. బరేలీ జిల్లా మేజిస్ట్రేట్ కుమార్ లేదా ఆరోగ్య అధికారులకు తమకు దీనిపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు. 

“నేను వీడియో చూడలేదు. కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలలో భాగంగా నగరంలోకి ప్రవేశించే వారందరికీ వైద్య పరీక్షలు జరిపి వారిని పరిశుభ్రంగా ఉండేలా చూడాలని మాత్రమే మాకు ఆదేశాలు ఉన్నాయి ”అని కుమార్ చెప్పారు. తాను వీడియో చూడలేదని, అయితే ఈ విషయాన్ని పరిశీలిస్తానని చెప్పారు. కానీ వారు (అధికారులు) ఏమి చేసినా కూడా అది ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మాత్రమే ఉండాలన్నారు.

క్లోరిన్ స్థాయిని బట్టి (లిక్విడ్ బ్లీచ్) చర్మంపై పూస్తే అది బర్నింగ్ దురదకు కారణమవుతుందని బరేలీలోని వైద్యుడు గిరీష్ మక్కర్ చెప్పారు. ఉపరితలాలను శుభ్రపరచడానికి ఈ రసాయనాన్ని క్రిమిసంహారక మందుగా ఉపయోగిస్తారని తెలిపారు.

ఇతర నగరాల నుండి 25 వేల మంది వలస కార్మికులు ఇప్పటివరకు బరేలీకి చేరుకున్నారని ఒక అధికారి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్చి 25 నుంచి లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి, దేశ రాజధాని  ఇతర మహానగరాల మీదుగా ఉన్న రహదారులు ప్రజలు తమ వస్తువులతో వందల కిలోమీటర్లు కాలినడకన బయల్దేరి వచ్చారు.

కొందరు అధికారుల సహాయంతో తమ స్వగ్రామానికి చేరుకున్నారు. చిక్కుకుపోయిన వలసదారులు డబ్బు ఆహారం కొరతతో పెద్ద నగరాలను విడిచిపెట్టడానికి కారణాలుగా పేర్కొన్నప్పటికీ, ఆరోగ్య నిపుణులు లాక్ డౌన్ ఉద్దేశానికి విరుద్ధంగా ఉందని హెచ్చరించారు. ఈ సమయంలో అందరూ గుంపులుగా వస్తే కరోనా వ్యాప్తి మరింత తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.